Kcr : పార్టీని విస్తరిస్తారా…? కేసీఆర్ ఏమనుకుంటున్నారు?

మొన్నటి దాకా ఎంత ఆత్మవిశ్వాసం…? ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ప్రజలు తమను తెలంగాణలో కలిపేసుకోమంటున్నారు. తెలంగాణ పథకాలు అంతగా ఇతర [more]

Update: 2021-11-03 09:30 GMT

మొన్నటి దాకా ఎంత ఆత్మవిశ్వాసం…? ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ప్రజలు తమను తెలంగాణలో కలిపేసుకోమంటున్నారు. తెలంగాణ పథకాలు అంతగా ఇతర రాష్ట్రాలను ఆకట్టుకుంటున్నాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇది కల్పితం కాదు. వారంతట వారే చేస్తున్న డిమాండ్లు. ఇవీ మొన్నటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికతో సీన్ మొత్తం మారిపోయింది.

మూడు రాష్ట్రాల నుంచి….

మొన్నా మధ్య ప్లీనరీలో మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఐదు నియోజవర్గాల ప్రజలు తన వద్దకు వచ్చి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారన్నారు. అలాగే కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే అయితే ఇక్కడి పథకాలను చూసి తమ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారన్నారు. ఇక ఏపీ నుంచి అయితే రోజూ ఫోన్ల వస్తూనే ఉన్నాయని, అక్కడ టీఆర్ఎస్ ను పెట్టమంటున్నారని తెలిపారు.

ఇక్కడి ఓటమితో….

కాని హుజూరాబాద్ ఎన్నిక కేసీఆర్ కు పొరుగు రాష్ట్రాల్లోనే చూసుకో అన్నట్లు తీర్పు చెప్పినట్లుందన్న సెటైర్లు విన్పిస్తున్నాయి. అంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అంతా కన్పించి ఉండవచ్చు. అక్కడ ఈటల బలమైన అభ్యర్థి కావచ్చు. కానీ ఎన్ని పథకాలు..? ఎన్ని అభివృద్ధి పనులు? ఎంత నగదు పంపిణీ? ఇవేమీ టీఆర్ఎస్ ను కాపాడలేకపోయాయే అన్న చర్చ జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినా అది వ్యూహ లోపం అని కేసీఆర్ సరిపెట్టుకున్నారు.

అన్ని వ్యూహాలు….

కానీ హుజూరాబాద్ లో మాత్రం ఎటువంటి వ్యూహ లోపం లేదు. తొలి నుంచి సర్వేలు అనేక సార్లు చేయించి మరీ నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను మొహరించారు. కులాల వారీగా తాయిలాలను ప్రకటించారు. ఒక్క హుజూరాబాద్ లోనే అనేక నామినేెటెడ్ పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈ ఎన్నిక మాత్రం నాయకులకు ఉపయోగపడింది కాని, పార్టీకి ఏమాత్రం ప్రయోజనం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక పొరుగు రాష్ట్రాలపై సెటైర్లు వేయడం మానేసి సొంత రాష్ట్రంలో బలపడటానికి శ్రమిస్తే బాగుంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News