టిడిపిలో కాకరేపుతున్న కాపులు అంతా కమలానికేనా ?

తెలుగుదేశం పార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చరిత్రలో లేని విధంగా ఓటమినుంచి టిడిపి కోలుకోకుండానే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది [more]

Update: 2019-06-22 04:30 GMT

తెలుగుదేశం పార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చరిత్రలో లేని విధంగా ఓటమినుంచి టిడిపి కోలుకోకుండానే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఇప్పుడు. ఈ బాధలు మర్చిపోదామని ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన అధినేత చంద్రబాబు నాయుడు కు అక్కడ కూడా శాంతి లేకుండా చేశారు తమ్ముళ్లు. నలుగురు రాజ్యసభ సభ్యులు చడీ చప్పుడు లేకుండా కమలం తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో విదేశీ పర్యటనలో ఉంటూనే మిగిలినవారిని కాపాడుకునే వారి ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుంది బాబుకు. ఇది ఇలా ఉండగానే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కాపు సామాజికవర్గం ఎమ్యెల్యేలు కాకినాడలో సమావేశం అయ్యి తమ భవిష్యత్తు పై సమాలోచనలు చేయడం వారు ఈ కార్యక్రమంలో ఉండగానే బిజెపి లోకి వెళ్ళిన టిడిపి ఎంపీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తడం అధినేతను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

తోట నేతృత్వంలో ….

రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో టిడిపి కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్యెల్యేలు కాకినాడలో మీట్ అయ్యారు. ఈలి నాని, బడేటి బుజ్జి, కెఎ నాయుడు, జ్యోతుల నెహ్రు, వరుపుల రాజా, బోండా ఉమా, బండారు మాధవ నాయుడు, చెంగల రాయుడు, మీసాల గీత, కదిరి బాబురావు, బూరగడ్డ వేదవ్యాస్ త్రిమూర్తుల సదస్సుకు హాజరయ్యారు. పైకి తమ ఓటమిపై సమీక్ష గా వీరు ప్రకటించుకున్నా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులని ఎత్తిచూపుతూ అంతా చెలరేగినట్లు సమావేశం. టిడిపి కి భవిష్యత్తు కష్టమేనని ఐదేళ్ళు నియోజకవర్గాల్లో పార్టీని మొయ్యడం వైసిపి సర్కార్ ఉండగా ఎదురయ్యే నష్టాలను కాపు నేతలు ప్రస్తావించించినట్లు సమాచారం.

పవన్ తో వెళ్లకుండా కొంప ముంచారు …

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం పార్టీ ఓటమికి ప్రధాన కారణమని అంతా తేల్చారని తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన ను కలుపుకుని వెళ్లకుండా చేయడం తద్వారా కాపు సామాజికవర్గం ఓట్లు చీలిపోయేలా చేసి తమ ఓటమిని బాబు శాసించారని చివరికి ఆయనకూడా అధికారం తిరిగి పొందకుండా తనగొయ్యి తానె తవ్వుకున్నారన్న అభిప్రాయం ఈ సమావేశంలో కొందరు వ్యక్తం చేశారని అంటున్నారు. కాపులకు ఇప్పుడు రాజకీయ భవిత ఏమిటని భవిష్యత్తులో కూడా సమావేశమై కార్యాచరణ తీసుకోవాలని ఆఫ్ ది రికార్డ్ మీటింగ్ లో తేల్చారని అంటున్నారు.

జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తుందని అనుకుంటే …

వైసిపి కి వెళ్ళే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జనసేనకు వెళితే టిడిపి తిరిగి అధికారం దక్కుతుందన్న చంద్రబాబు నాయుడు ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందని సమావేశం తేల్చింది. అటు జనసేన ఇటు టిడిపి కూడా ఈ వ్యూహంతో ఘోరంగా దెబ్బ తిన్నాయని ఇప్పుడు కిమ్ కర్తవ్యమని వీరంతా అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై దుమ్మెత్తి పోశారంటున్నారు. పైగా ఎన్నికల ఓటమిపై కనీసం చంద్రబాబు నాయుడు సరైన ఆత్మ విమర్శ చేసుకోకపోవడాన్ని కాపు నేతలు తప్పుపట్టారు. ఇలా అయితే ఇక టిడిపికి భవిష్యత్తు కష్టమే అని అభిప్రాయపడటం విశేషం.

కమలమే ఆశా దీపం …

వినా అధికారం పట్టించుకునే వారు ఉండరని లెక్కల్లో నేతల్లో ఆందోళన మొదలయ్యింది అంటున్నారు. కొందరు వైసిపి లోకి జంప్ అవుదామని సూచిస్తే, మరికొందరు బిజెపి లోకి వెళితే భవిష్యత్తు ఉంటుందని తమ అంచనాలను వివరించారని అంటున్నారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయం గా కాపులను బిజెపి ప్రోత్సహిస్తున్న అంశాన్ని కాపు నేతలు పరిశీలించారని తెలుస్తుంది. అయితే తమ భవిష్యత్తుపై సుదీర్ఘ ఆలోచనల తరువాత నిర్ణయం తీసుకుందామని పలువురు చేసిన సూచనలు తో అంతా ఏకీభవించారని సమాచారం.

రాజప్ప గుడ్ బై ….

గత సర్కార్ లో ఉప ముఖ్యమంత్రి హోమ్ మంత్రి గా వ్యవహరించడమే కాదు ఇటీవల ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తిరిగి శాసనసభలో అడుగుపెట్టిన నిమ్మకాయల చినరాజప్ప కాపు నేతల సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. టిడిపి కి వీరవిధేయుడు గా వుండే రాజప్ప గతంలో ప్రజారాజ్యం సమయంలోను గోడ దూకేందుకు సిద్ధం కాలేదు. జనసేన నుంచి ఆఫర్లను ఆయన తిరస్కరించి చంద్రబాబు నాయుడు పట్ల తన నిబద్ధత చాటిచెప్పారు. ఇప్పుడు కూడా సమావేశానికి రావాలని ఆయనపై వత్తిడి వచ్చినా దూరంగానే వున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News