పిలుపులో అనురాగమే… చేతల్లో మాత్రం….?

గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల‌. వైసీపీకి చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఇక్కడ పార్టీని నిల‌బెట్టార‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో కాంగ్రెస్ [more]

Update: 2020-03-02 06:30 GMT

గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల‌. వైసీపీకి చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఇక్కడ పార్టీని నిల‌బెట్టార‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచిన ఆయ‌న 2014లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే, గత ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఆయ‌న టికెట్‌ను త్యాగం చేసి యువ నాయ‌కుడు, కాసు కృష్ణారెడ్డి వార‌సుడు మ‌హేష్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. అంతేకాదు, ఆయ‌న వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి ఎన్నిక‌ల‌లో కాసు మహేష్ రెడ్డి త‌ర‌ఫున ప్రచారం కూడా చేశారు.

గ్యాప్ పెరిగడంతో…..

ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. ఆరు మాసాలు తిరిగే స‌రికి గుర‌జాల‌లో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ‌ర్సెస్ జంగా పోరు ప్రారం భమైంది. త‌న‌కు టికెట్ ఇచ్చి గెలిచేందుకు దోహ‌ద‌ప‌డిన జంగా అంటే కాసు మహేష్ రెడ్డికి గౌర‌వం ఉన్నా, అన్నా .. అన్నా అని పిలుపులో అనురాగం చూపిస్తున్నా.. ఇద్దరి మ‌ధ్య ఇగో ఫీలింగ్స్‌తోపాటు చెప్పుడు మాటలు కూడా అడ్డుగా నిలుస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇద్దరి మ‌ధ్యగ్యాప్ పెరిగింది. ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకునేందుకు, ఎదురు ప‌డేందుకు కూడా ఇష్టప‌డ‌నంత‌గా ఈ గ్యాప్ పెర‌గ‌డంపై నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలో…..

ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం జ‌రిగిన‌ప్పుడు చాలా మంది సీనియ‌ర్లు.. జంగాకు త‌మ త‌మ పేర్లను ఈ ప‌ద‌వుల జాబితాలో ఉండేలా చూడాల‌ని కోరారు. అయితే, అప్పటికే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి త‌న జాబితాను తాను రెడీ చేసుకోవ‌డంతోపాటు క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ అయిన జంగా దృష్టికి కూడా తీసుకు వెళ్లక‌పోవ‌డం ఇద్దరి మ‌ధ్య ఉన్న వివాదానికి మ‌రింత చ‌మురు పోసిన‌ట్టయింది. జంగా ఎమ్మెల్సీ అయినంత మాత్రాన నేను ఆయ‌న‌ ద‌గ్గర‌కు ఎందుకు వెళ్లాల‌నే ధోర‌ణి కాసు మహేష్ రెడ్డి లో పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

పంతానికి పోతుండటంతో….

అదే స‌మ‌యంలో జంగా కూడా నావ‌ల్లే కాసు మహేష్ రెడ్డికి టికెట్‌ ల‌భించింది. నేను తిరిగి ప్రచారం చేయ‌క‌పోతే.. ఆయన గెలిచేవాడా? ఇప్పుడు నేను ఆయ‌న‌ ద‌గ్గర‌కు వెళ్లేది ఏంటి? అని పంతానికి పోతున్నారు. ఇలా ఇద్దరూ పంతంతో ఉండ‌డంతో పార్టీ కోసం క‌ష్టించిన వ‌ర్గంలో చీలిక ఏర్పడింది. జంగా అనుచ‌రులుగా కొంద‌రిపై కాసు మహేష్ రెడ్డి వ‌ర్గం ముద్ర వేసింది. వారికి స‌హ‌క‌రించ‌కుండా ప‌క్కన పెట్టింది. దీంతో ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి వ‌ర్సెస్ జంగా కృష్ణమూర్తిల మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు దారితీస్తున్న ప‌రిణామాలు కూడా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇది ముదురుతుందో.. లేదా ఆదిలోనే ప‌రిస‌మాప్తి అవుతుందో చూడాలి.

Tags:    

Similar News