కేశినేని ఎఫెక్ట్.. బెజవాడ టీడీపీలో రాజుకున్న నిప్పు
ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు మరోసారి బెజవాడ టీడీపీ రాజకీయాలను హీటెక్కించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చాలా విభిన్నమైంది. రాజకీయాలకు కేంద్ర [more]
ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు మరోసారి బెజవాడ టీడీపీ రాజకీయాలను హీటెక్కించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చాలా విభిన్నమైంది. రాజకీయాలకు కేంద్ర [more]
ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు మరోసారి బెజవాడ టీడీపీ రాజకీయాలను హీటెక్కించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చాలా విభిన్నమైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన విజయవాడలో ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు తమ తమ వీలును బట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. గత ఐదేళ్లపాటు మేయర్‌గా టీడీపీకి చెందిన కోనేరు శ్రీధర్ ఉన్నా రు. అయితే ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో కీలకమైన పదవిని తామే దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఇప్పటికే నాయకులకు పిలుపు కూడా ఇచ్చింది. ఏపీ రాజధాని మార్పు ప్రభావం విజయవాడ నగరంపై ఎక్కువుగానే ఉంటుందని టీడీపీ ఆశలు పెట్టుకుంది.
ఆ ప్రచారంతో…..
పైగా గత ఎన్నికల్లో కూడా రాజజధాని నగరంలో ఉన్న రెండు ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. దీంతో ఈసారి ఈ రెండు కార్పొరేషన్లపై వైసీపీ జెండా ఎగుర వేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉండడంతో పాటు ఇప్పటికే స్థానిక నేతలకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఇటు టీడీపీ సైతం విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆపార్టీ అధినేత నుంచి కీలకమైన ప్రకటన వచ్చిందన్న టాక్ పార్టీలో వచ్చింది. అది విజయవాడ మేయర్ పీఠం విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె స్వాతికి కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా ఉన్న రెండు వర్గాలు నేడు సైలెంట్ అయిపోయాయి.
గద్దె తన సతీమణికి…..
వాస్తవానికి మేయర్ పీఠం కోసం తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఆశలు పెట్టు కున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల కాలంలో రాజధాని రగడలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తరచుగా విజయవాడలో రాజధాని కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీ మారిపోవాలని అనుకున్న సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా పార్టీలో కొన సాగు తున్నారు. ఈ క్రమంలో ఈయన కూడా తన సతీమణి సుజాతను రంగంలోకి దింపి, మేయర్ పీఠంపై కూర్చోబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
కేశినేని ఇబ్బంది పెడుతున్నా….
అయితే, ఇప్పుడు హఠాత్తుగా కనీసం తమతో ఒక్క మాట కూడా చెప్పకుండానే కేశినేని స్వాతిని సెలక్ట్ చేయడంపై ఈ రెండు వర్గాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దూకుడుగా చేసిన ప్రచారాన్ని ఇప్పుడు ఈ రెండు వర్గాలు తగ్గించాయి. పార్టీ అధినేత వైఖరిపైనా ఆగ్రహంతో ఉన్నాయి. ఇన్నాళ్లు పార్టీ కోసం తాము కృషి చేశామని, కానీ ఇప్పుడు పదవుల పంపకం మాత్రం మరొకరికా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మార్పు వెనక కేశినేని నాని పార్టీపై ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు.
అధికార ప్రకటన చేయలేదంటూ….
అందరూ ఓడినా తాను మాత్రం తన సొంత బలంగా ఎన్నికల్లో గెలిచానని అయితే చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఆయన ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా కామెంట్లతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అసంతృప్తి చల్లార్చడానికి. ఆయన్ను గప్‌చుప్ చేసేందుకే ఆయన కుమార్తెకు మేయర్ పదవి ఇచ్చి ఉండవచ్చని కొందరు చర్చించుకుంటున్నా… దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.