యువనేతకు ఎంపీ టిక్కెట్… క్యాస్ట్ ఈక్వేషన్లో బాబు సైడ్ చేస్తున్నారా ?
కిమిడి నాగార్జున. మాజీ మంత్రి కిమిడి మృణాళిని వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ [more]
కిమిడి నాగార్జున. మాజీ మంత్రి కిమిడి మృణాళిని వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ [more]
కిమిడి నాగార్జున. మాజీ మంత్రి కిమిడి మృణాళిని వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి గెలుపు గు ర్రం ఎక్కలేక పోయారు. రాజకీయంగా కుటుంబం నేపథ్యమే మినహా పెద్దగా అనుభవం లేకపోయినా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీని బలోపేతం చేయడంలో మాత్రం ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో మృణాళిని మంత్రిగా ఉన్న సమయంలో అటు శాఖలోనూ… ఇటు చీపురుపల్లి నియోజకవర్గంలోనూ ఆయన చక్రం తిప్పారు. ఈ ఫ్యామిలీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్లే అయినప్పటికీ.. నాన్‌లోకల్ కోటాలో విజయ నగరంలో కిమిడి నాగార్జున చక్రం తిప్పేస్తున్నారు.
లోక్ సభకు పంపాలని…..
గత ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసి.. గెలుపు గుర్రం ఎక్కాలని అనుకున్నా వైసీపీ వేవ్‌లో కొట్టుకుపోయారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాగార్జునకు విజయనగరం పార్లమెంటరీ జిల్లా టీడీపీ పగ్గాలను అప్పగించారు. ఈ పార్లమెంటు పరిధిలో పార్టీలో మహామహాలు అయిన నేతలు ఉన్నా నాగార్జునకే ఈ పదవి దక్కడం వెనక ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును సంతృప్తి పరిరచే అంశం కూడా ఉంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ యువ నేతను లోక్‌సభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నాగార్జునను పార్లమెంటుకు పంపించాలని, విజయనగరం ఎంపీ టికెట్‌ను ఆయనకే ఇవ్వాలని బాబు ఇప్పటికే డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే తాను మాత్రం….
ఈ విషయాన్ని ఆయనకు బాబు ఇప్పటికే సూచాయగా స్థానిక పార్టీ నేతలకు కూడా చెప్పేశారు. విజయనగరం పార్లమెంటు విజయనగరంతో పాటు అటు శ్రీకాకుళం జిల్లాలోనూ విస్తరించి ఉంది. చీపురుపల్లిలో ఇప్పటికే నాన్‌లోకల్ అది కూడా పొరుగు జిల్లాకు చెందిన వాళ్లకు ఈ నియోజకవర్గం అప్పగించేస్తే పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన మేం ఏమైపోవాలని బాబును ఇక్కడ నేతలు నిలదీస్తున్నారు. అందుకే బాబు వ్యూహాత్మకంగా యువకుడిగా ఉన్న నాగార్జునకు పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీ చేసే ఆలోచనలో ఉన్నానని అంటున్నారు.
అశోక్ రాజకీయాల నుంచి తప్పుకుంటుండటంతో….
అక్కడ బొత్సను ఢీకొట్టి.. ఓడించి రికార్డు సృష్టించాలని. అసెంబ్లీలో గళం వినిపించాలన్న పట్టుదలతో తమ నేత ఉన్నాడని నాగార్జున అనుచరులు చెబుతున్నారు. అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు నాగార్జునను పంపి… చీపురుపల్లిలో స్థానికంగా బలమైన నేతలను ప్రోత్సహిస్తేనే క్కడ పార్టీ పుంజుకోవడంతో పాటు అసమ్మతి ఉండదన్నదే బాబు ప్లాన్.