కోటంరెడ్డిని కార్నర్ చేస్తున్న వైసీపీ నేత ఎవరు?

నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి [more]

Update: 2019-10-06 06:30 GMT

నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి నమ్మకమైన నేత. జగన్ కు అత్యంత ఆప్తుడు. పార్టీ కష్టసమయంలోనూ జెండాను వదలలేదు. తొలిసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ కు అండగా నిలిచారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా….

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అప్పటి అధికార పార్టీ అనేక కేసులు నమోదు చేసింది. క్రికెట్ బెట్టింగ్ కేసు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నమోదయింది. అయినా ఆయన కేసులకు భయపడలేదు. జగన్ వెన్నంటే నిలిచాడు. నెల్లూరు జిల్లాలో అప్పటి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ ధాటికి తట్టుకుని నిలబడ్డారు. వైసీపీ క్యాడర్ లో ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నూరిపోస్తూ ఐదేళ్ల పాటు వైసీపీ పటిష్టమయ్యేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేశారనడం వాస్తవం.

క్లీన్ స్వీప్ చేసి…..

నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని నియోజకవర్గాలు గెలుచుకున్న నాలుగు జిల్లాల్లో నెల్లూరు ఒకటిగా నిలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ నెల్లూరు జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. సీనియర్ గా, నమ్మకంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాత్రం జగన్ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు.

కుట్ర చేస్తుంది ఎవరు?

తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎంపీడీవో సరళ పెట్టిన కేసులో కొత్త ట్విస్టు బయటకు వచ్చింది. కోటంరెడ్డిని వైసీపీ నేతలే కార్నర్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సఖ్యతగానే ఉంటారు. మేకపాటి గౌతంరెడ్డి కూడా కొంత నెమ్మది స్వభావం కలిగిన వ్యక్తి. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై కేసులు వెనక వైసీపీ పెద్దల ప్రమేయం ఉందని అనడం సంచలనానికి దారి తీసింది. కోటంరెడ్డిపై కుట్ర చేసింది ఎవరన్న చర్చ జరుగుతోంది. మండల స్థాయి నాయకులు కుట్ర చేశారంటున్నా దీని వెనక పార్టీ సీనియర్ నేత హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. కాకాణి గోవర్థన్ రెడ్డి కోటంరెడ్డిపై కుట్ర వెనక ఉన్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News