ఈయనంటే ఎందుకంత సాఫ్ట్ కార్నర్?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం తగ్గేట్టు లేరు. తాను జగన్ అభిమానిని, ఆయనంటే తనకు ప్రాణమని ఒక పక్క చెబుతూనే మరో వైపు పార్టీనే కొన్ని సందర్భాల్లో [more]

Update: 2020-02-17 12:30 GMT

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం తగ్గేట్టు లేరు. తాను జగన్ అభిమానిని, ఆయనంటే తనకు ప్రాణమని ఒక పక్క చెబుతూనే మరో వైపు పార్టీనే కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పార్టీ అధినాయకత్వం సానుకూలంగా ఉండటం విశేషం. ఆనం రామకృష్ణారెడ్డి నెల్లూరు మీడియా సమావేశం పెట్టి మాఫియా పెరిగిపోయిందని అంటేనే షోకాజ్ నోటీసు వరకూ పరిస్థిితి వెళ్లింది. ఆనం విషయంలో స్వయంగా జగన్ జోక్యం చేసుకున్నారు.

ఆనం విషయంలో…..

చివరకు ఆనం రామనారాయణరెడ్డి జగన్ వద్దకు వెళ్లి వివరణ ఇచ్చుకుంటే తప్ప శాంతించలేదు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ సైలెంట్ అయ్యారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ ని అనేకమార్లు ఇబ్బంది పెట్టినా ఎటువంటి చర్యలకు దిగలేదు. ఎంపీడీవో ఇంటిపై దాడి విషయంలో కేసు పట్టి మమ అనిపించేశారు. అలాగే నెల్లూరు జర్నలిస్ట్ కు బెదిరింపుల విషయంలోనూ కోటంరెడ్డిని చూసీ చూడనట్లు వదిలేశారు.

పదే … పదే….

ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇసుక మాఫియా ఉందని తెలిపినా వైసీపీ అధిష్టానం చెవికి ఎక్కలేదు. ఇక ఇటీవల శాసనసభలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో వైసీపీ అధినాయకత్వం ఎలాంటి చర్యలకు దిగలేకపోయింది.

చూసీ చూడనట్లేనా?

నిజానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు మనస్తత్వం ఉన్న నేత. అయితే ఆయన తొలినుంచి జగన్ ను నమ్ముకుని ఉన్నారు. జగన్ అంటే పిచ్చ అభిమానం. దీంతోనే అధినాయకత్వం చూసిి చూడనట్లు వ్యవహరిస్తుందంటున్నారు. ఇదే విషయంపై ఆనం రామనారాయణరెడ్డి వర్గంలో చర్చ జరుగుతోంది. తమ నేత ఒక మాటంటే షోకాజ్ నోటీసు వరకూ వెళ్లిన వారు మిగిలిన నేతలు పదే పదే నోరుజారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కోటంరెడ్డి విష‍యంలో జగన్ సాఫ్ట్ గా ఉండటానికి కారణాలు అనేకం ఉన్నాయని నెల్లూరు జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News