తెలియకుండానే బలయిపోతున్నారుగా?

కర్ణాటక రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. బలమైన రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ నలిగిపోతుంది. జాతీయ పార్టీల మైండ్ గేమ్ కు జనతాదళ్ ఎస్ పరిస్థితి [more]

Update: 2021-01-11 18:29 GMT

కర్ణాటక రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. బలమైన రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ నలిగిపోతుంది. జాతీయ పార్టీల మైండ్ గేమ్ కు జనతాదళ్ ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిన్న మొన్నటి వరకూ జేడీఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై కుమారస్వామి ఖండించారు. ఎట్టిపరిస్థితుల్లో జరగదని, తాము అన్ని స్థానాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. దేవగౌడ సయితం దీనిపై చిర్రుబుర్రులాడారు.

విలీనం అంశం….

విలీనం అంశం మరుగున పడుతున్న సమయంలో మరోకొత్త ప్రచారం ఊపందుకోవడంతో కుమారస్వామికి ఊపిరి ఆడటం లేదు. కొత్తగా జనతాదళ్ ఎస్ బీజేపీకి మిత్రపక్షంగా మారుతుందన్న ప్రచారం బాగా జరుగుతుంది. దీని ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిలో బీజేపీకి జేడీఎస్ మిత్రపక్షంగా ఉంటుంది. దీనికి ప్రతిగా కుమారస్వామికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఈ అవగాహన ఇప్పటికే రెండు పార్టీల మధ్య కుదిరినట్లు వదంతులు బాగా వ్యాపించాయి.

అందుకేనంటూ…..

అయితే కుమారస్వామి మరోసారి దీనిని ఖండించారు. తాను కేంద్ర మంత్రిగా ఎందుకు వెళతానని ప్రశ్నించారు. జేడీఎస్ బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరంగానే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకోకుండా ఉండేందుకు మిత్రపక్షంగా వ్యవహరించాలని కుమారస్వామి నిర్ణయించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జేడీఎస్ ఎమ్మెల్యేలు….

ఇటీవల కాలంలో దాదాపు 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారంపైనే కుమారస్వామి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. యడ్యూరప్పకు కూడా ఇప్పుడు జేడీఎస్ మద్దతు అవసరం అని అంటున్నారు. కేంద్ర నాయకత్వం తనపై కొంత అసంతృప్తిగా ఉండటంతో తన సీటును కాపాడుకునేందుకైనా జేడీఎస్ తో చేతులు కలపాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. మొత్తం మీద కుమారస్వామి తనకు తెలియకుండానే బలయిపోతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News