మంత్రి వర్సెస్ ఎంపీ… వైసీపీ పరువు పోతోందా ?
ఒకే విషయం.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరదీసిందా? నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు పాలిటిక్స్ ఒక్కసారిగా రేజ్ [more]
ఒకే విషయం.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరదీసిందా? నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు పాలిటిక్స్ ఒక్కసారిగా రేజ్ [more]
ఒకే విషయం.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరదీసిందా? నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు పాలిటిక్స్ ఒక్కసారిగా రేజ్ అవుతున్నాయా? నేతల దూకుడుతో ప్రభుత్వ పరువు పోతోందా? ఇప్పటి వరకు సర్కారు తీసుకున్న చర్యలన్నీ నీళ్లపాలవుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే, కమ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ లో ఉన్నప్పడు…?
వాస్తవానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైసీపీలో ఎదగకుండా బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారనే వాదన కూడా గత కొంతకాలంగా వినిపించింది. ఇక, తాను ఎంపీ అయినప్పటికీ.. ఏమీ చేయలేక పోతున్నానని.. కొన్నాళ్లుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా మౌనంగా ఉన్నారు. ఇక, జిల్లా వ్యాప్తంగా ఏం చేయాలన్నా.. మంత్రి బాలినేనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణమే ఉంది. గత ఐదేళ్లు కూడా మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వర్గాన్ని పూర్తిగా అణగదొక్కారని బాలినేని గుర్రుగా ఉన్నారు.
పాత గొడవలన్నీ…?
అంతకు ముందు వీరు కాంగ్రెస్‌లో ఎంపీ, మంత్రులుగా ఉన్నప్పటి నుంచి కూడా సఖ్యత లేదు. తర్వాత బాలినేని వైసీపీలో, మాగుంట శ్రీనివాసుల రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా అవే గొడవలు.. ఇప్పుడు ఇద్దరూ వైసీపీలో ఉన్నా పాత మనస్పర్థలు పోలేదు. ఇప్పుడు బాలినేని మంత్రిగా జిల్లాలో హవా చెలాయిస్తుండడంతో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వర్గానికి చిన్న పదవులు కూడా రానివ్వడం లేదు. చివరకు ఆనందయ్య కరోనా నివారణ మందు సాక్షిగా ఇద్దరునేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడడంతో పాటు దీనిపై వీరిద్దరు అధిష్టానంకు ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
ఇద్దరి మధ్య …?
జిల్లాలో సుధీర్ఘకాలంగా ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి పలు నియోజకవర్గాల్లో అనుచరగణం ఉంది. వీరికి ఏ మాత్రం ప్రయార్టీ ఉండడం లేదు. బాలినేని ఎమ్మెల్యేలకు ఎంపీ ఆదేశాలను, అనుచరులను పక్కన పెట్టాలని నేరుగానే ఆదేశాలు ఇచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో బాలినేని కన్నా సీనియర్ అయ్యి ఉండి కూడా తనకు పార్టీలో విలువ లేదని మాగుంట శ్రీనివాసుల రెడ్డి రగులుతున్నారు. ఇప్పటి వరకు సైలెంట్‌గానే తన పని తాను చేసుకుపోతూ వస్తోన్న ఆయన ఇప్పుడు బాలినేనితో సై అంటే సై అంటుండడంతో జిల్లా వైసీపీ పరువు బజారున పడుతోంది.