తిరుగుబాట్లు ఎందుకు? అర్ధమవుతోందా?

మమత బెనర్జీ పాలనపై మొహం మొత్తిందా? ఆమె నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందా? అంటే బెంగాల్ రాజకీయాలను ఒకసారి చూస్తే అవుననే అనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరు పార్టీని [more]

Update: 2020-12-04 16:30 GMT

మమత బెనర్జీ పాలనపై మొహం మొత్తిందా? ఆమె నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందా? అంటే బెంగాల్ రాజకీయాలను ఒకసారి చూస్తే అవుననే అనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరు పార్టీని వీడిపోతుండటం ఈ ప్రశ్నలకు మరింత ఊతమిచ్చింది. మమత బెనర్జీ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒంటిచేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మమత బెనర్జీ చరిష్మా వల్లనే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నది కాదనలేని వాస్తవం.

ఒంటిచేత్తో అధికారంలోకి…..

దశాబ్దాలుగా వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టి మరీ మమత బెనర్జీ అధికారంలోకి వచ్చారంటే అది ఆమె చలవే. ఆమె చేసిన ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకున్న తీరు అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే రెండు సార్లు సులువుగా అధికారంలోకి వచ్చిన మమత బెనర్జీ మూడోసారి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతుండటం మమత బెనర్జీని ఆందోళన కల్గిస్తుంది.

సీనియర్ నేతలే……

బీజేపీని కట్టడి చేసే పనిలో ఉన్న మమత బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అండగా ఉండాల్సిన సమయంలో మమత బెనర్జీని వీడి నేతలు వెళ్లిపోతున్నారు. ప్రధానంగా మంత్రివర్గంలో ఉన్న వారే పార్టీని వీడి వెళుతుండటం ఆందోళన కల్గించే విషయమే. ఇటీవల పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్ి సువేందు అధికారి పార్టీని వీడివెళ్లిపోయారు. మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. సువేందు అధికారి పార్టీలో సీనియర్ నేత కావడం విశేషం. టీఎంసీ ఎమ్మెల్యే గోస్వామి కూడా పార్టీని వీడారు. ఈయన కూడా టీఎంసీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే.

మరికొందరు కూడా…..

ఈయనతో పాటు మరికొందరు పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో సీనియర్ నేతలు కూడా ఉండటం విశేషం. మమత బెనర్జీని ఎన్నికలకు ముందు మానసికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించింది. సీనియర్ నేతలే వెళుతుండటంతో పార్టీ క్యాడర్ ధైర్యాన్ని కూడా దెబ్బతినే అవకాశముంది. దీంతో మమత బెనర్జీకి రానున్న కాలంలో పార్టీ నుంచి మరిన్ని తలనొప్పులు రాకతప్పట్లు లేవు. మరి ఈ చిక్కుల నుంచి దీదీ ఎలా బయటపడతారో చూడాలి.

Tags:    

Similar News