ఈసారి 30 మంది గెలవడం డౌటేనట…అందుకేనా?

వైసీపీలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో చాలా మంది కొత్త ముఖాలు విజ‌యం సాధించాయి. అప్పటి వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న కొంద‌రు యువ‌త‌ను ప‌నిగ‌ట్టుకుని తెచ్చి.. జ‌గ‌న్ [more]

Update: 2021-09-13 14:30 GMT

వైసీపీలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో చాలా మంది కొత్త ముఖాలు విజ‌యం సాధించాయి. అప్పటి వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న కొంద‌రు యువ‌త‌ను ప‌నిగ‌ట్టుకుని తెచ్చి.. జ‌గ‌న్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారు. వీరంతా కూడా జ‌గ‌న్ సునామీలో కొట్టుకొచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అస‌లు సంత‌కం తప్ప ఇత‌ర రాజ‌కీయాలు తెలియ‌ని వారిని కూడా గ‌త ఎన్నిక‌ల్లో (ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు) జ‌గ‌న్ గెలుపు గుర్రం ఎక్కించారు. వీరంతా తొలి ఏడాది చాలా హుషారుగా ఉన్నారు.

రెండు నెలలే….

'జ‌గ‌న‌న్నకు జై' అంటూ.. నినాదాలు చేశారు. కానీ, గ‌త ఆరు మాసాలుగా మాత్రం వీరిలో ఒక విధ‌మైన బెంగ అలుముకుంది. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు.. ఓట‌మి భ‌యంతో అల్లాడుతున్నార‌ని.. వైసీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని.. అంటున్నారు. ఒక‌టి.. ఇప్పటికీ చాలా మంది ప్రజ‌ల‌కు వైసీపీకి ఓటు వేయ‌డ‌మే తెలుసు త‌ప్ప.. అభ్యర్థి ఎవ‌ర‌నేది క్లారిటీ లేద‌ట‌. చిత్రంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలి రెండు నెల‌లు మాత్రమే .. ఎమ్మెల్యేలు ఎంపీలు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించారు.

గుర్తుపట్టేది కూడా…?

ఆ త‌ర్వాత‌… వ‌చ్చిన వ‌లంటీర్ వ్యవ‌స్థ, స్పంద‌న కార్యక్రమాల కార‌ణంగా వీరికి నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగే అవ‌కాశం, అవ‌స‌రం కూడా లేకుండా పోయింది. ఇదేదో బాగుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లినా వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఎంపీల‌ను ప్రజ‌లు గుర్తుప‌ట్టే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నేది వీరి ఆవేద‌న‌. “అస‌లు మ‌మ్మల్ని జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదండీ“ అని క‌ర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఇటీవ‌ల మీడియాతోనే అనేశారు. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి 30కిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది.

ఎమ్మెల్యేలను పక్కన పెట్టి…?

ఎందుకంటే.. గ‌తంలో ప్రభుత్వాలు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజ‌ల‌కు అందించేవారు. చివ‌ర‌కు రు. 5 వేల చెక్కు పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా ఎమ్మెల్యేల చేతుల మీదే నానా ఆర్భాటం చేసి మ‌రీ ఇచ్చేవారు. అదే స‌మ‌యంలో వారి స‌మ‌స్యలు తెలుసుకుని ప‌రిష్కరించే ఉద్దేశంతో ప్రజ‌ల‌కు చేరువ‌య్యేవారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా వైసీపీ ప్రభుత్వమే నేరుగా ల‌బ్ధి దారుల ఖాతాల‌కు నిధులు ఇస్తోంది. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామా ? అంటే అదీ లేదు.

ప్రయారిటీ లేకపోవడంతో…?

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేల‌కు.. అటు కేంద్రం నుంచి ఎంపీల‌కు నిధులు ఆగిపోయాయి (క‌రోనా నేప‌థ్యంలో ప్రధాని మోడీ.. ఎంపీలాడ్స్‌ను రెండేళ్లుగా ఆపేశారు). ఇక త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క ప్రాజెక్టులు, అధ్వానంగా ఉన్న ర‌హ‌దారుల కోసం నేరుగా జ‌గ‌న్‌ను క‌లిసి నిధులు రాబ‌ట్టుకుందామా ? అంటే సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ రావ‌డం లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప‌ద‌వుల విష‌యంలో కూడా ఈ వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్రయార్టీ లేదు. దీంతో అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ప‌రిస్థితి ఇలానే ఉంటే.. తాము గెల‌వ‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో, ఈ స‌మ‌స్య ఎలా ప‌రిష్కారం అవుతుందో చూడాలి

Tags:    

Similar News