మోదీకి… ఈ పెళ్లికి లింకేంటి….???

రాజకీయ సెగ శుభకార్యాలకు తాకుతుంది. ఈ కార్యక్రమాల్లో రాజకీయాలు చర్చించుకోవడం రొటీన్ గా జరిగే తంతు. అలాగే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కలుస్తూ ఉండటం [more]

Update: 2019-03-10 02:30 GMT

రాజకీయ సెగ శుభకార్యాలకు తాకుతుంది. ఈ కార్యక్రమాల్లో రాజకీయాలు చర్చించుకోవడం రొటీన్ గా జరిగే తంతు. అలాగే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కలుస్తూ ఉండటం కూడా సహజమే. కానీ బీహార్ లో అశోక్ సింగ్ అనే బిజెపి అభిమాని శుభలేఖ నెట్టింట వైరల్ అయ్యింది. తన కుమార్తె పెళ్ళి పిలుపుకి ముద్రించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు చర్చనీయం కావడం విశేషం.

మోడీని గెలిపించండి …

ప్రధాని మోడీకి మరోసారి అధికారం అప్పగించాలని అశోక్ సింగ్ తన శుభలేఖలో అభ్యర్ధించారు. పెళ్ళికి వచ్చి నూతన వధూవరులను దీవించిన వారంతా తమ ఓట్లేసి తమ అభిమాన నేత సర్కారును కొనసాగించాలని అందులో పేర్కొనడం విశేషం. ఈ శుభలేఖ చర్చ కేవలం బీహార్ కే పరిమితం కాలేదు. సోషల్ మీడియా కు ఎక్కడంతో దేశవ్యాప్తంగా ఈ కార్డు హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారం ఇంత భారీగా సాగడంలో కమల దళం సోషల్ మీడియా గట్టిగానే కృషిచేయడం విశేషం. ఎన్నికల కాలంలో ఇకపై మరిన్ని ఇలాంటి వింతలు పార్టీలు ఇంకెన్ని మోసుకొస్తాయో చూడాలి.

Tags:    

Similar News