ఆ ప్రశ్నలకు బదులు ఏది …?

మొన్నీ మధ్యనే పోలవరం ప్రాజెక్ట్ పై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లేఖాస్త్రం సంధిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వెంటనే మాజీ ఎంపి [more]

Update: 2019-05-10 06:30 GMT

మొన్నీ మధ్యనే పోలవరం ప్రాజెక్ట్ పై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లేఖాస్త్రం సంధిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వెంటనే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో పోలవరం లో ఎపి సర్కార్ మితిమీరి నడిపిన వ్యవహారం ఫలితం రాష్ట్ర ప్రజల నెత్తిపై వేల కోట్ల రూపాయల భారం పడేలా ఉందని అలాగే ప్రాజెక్ట్ నాణ్యత, అవినీతిపై అనేక ప్రశ్నలను సంధిస్తూ ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రచార ఆర్భాటంగా అధికార పార్టీ ఎలా వాడుకుందో పూసగుచ్చినట్లు చెప్పేశారు. తన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు సమాధానం చెప్పాలని డిమాండ్ సైతం చేశారు.

కట్ చేస్తే టివి 9 వేదికగా ….

కెవిపి, ఉండవల్లి ఆరోపణలు విమర్శలకు ఒకేరోజులో ముగింపు పలికేలా టివి 9 చొరవ చూపించింది. ఒక పక్క ఢిల్లీ లో కెవిపి రామచంద్ర రావు ను మరోపక్క ఉండవల్లి అరుణ కుమార్ ను ఇంకోపక్క మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ను వేరు వేరు ప్రాంతాల్లో చర్చలో కూర్చో పెట్టింది. ప్రశ్నలు వేసిన వారికి మంత్రి దేవినేని చేత సమాధానాలు చెప్పించింది. ఇదంతా సీఈఓ రవిప్రకాష్ చాలా చాక చక్యంగా నడిపించారు. చివరికి వారు అడిగారు ప్రభుత్వం సమాధానాలు చెప్పేసింది ఇక ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసింది అనే రీతిలో ఈ కార్యక్రమం సాగడం పై సోషల్ మీడియా లో చర్చ నడిచింది. ఇలాంటి పెయిడ్ చర్చా కార్యక్రమాలు కూడా ఎపి కి లైఫ్ లైన్ వంటి పోలవరం పై టాప్ రేటింగ్ లో ఉన్న ఛానెల్ చేయడం విమర్శల పాలు అయ్యేలా చేసింది. ఈ చర్చ చూసిన వారికి ప్రభుత్వం తరపున టివి 9 వ్యవహారం సాగించినట్లు ఉందన్న ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అసలు ప్రశ్నలకు సమాధానాలు దొరక్క పోగా వాటిపై రంధ్రాన్వేషణ చేయాలిసిన బాధ్యతాయుత మీడియా రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడిన కీలక అంశం ఇక్కడితో వదిలేస్తే మంచిది అన్న సందేశాన్ని అటు కెవిపి, ఇటు ఉండవల్లికి పరోక్షంగా చెప్పక చెప్పింది.

తనపైనే ఆరోపణలు వస్తే ….

పోలవరం వంటి ప్రాజెక్ట్ పై ప్రశ్నలు లేవనెత్తితే అప్పటికప్పుడు హడావిడి పడిన ఛానెల్ తమ సంస్థ వ్యవస్థాపకుడు సీఈవో పై క్రిమినల్ కేసు పై సూటిగా స్పందించక పోవడం చర్చకు దారితీసింది. కొత్త యాజమాన్యం చేసిన ఫిర్యాదు ఇది. దీనికి నా జవాబు ఇది. అంటూ టివి 9 రవి ప్రకాష్ తన ఛానెల్ లో నిర్భయంగా చెప్పుకోలేక పోయారు. పైగా తన పై వార్తలు వండి వారుస్తున్న వారికి ధన్యవాదాలు అంటూ కొత్త స్లోగన్ ఇచ్చారు. నటుడు తన స్నేహితుడు శివాజీ తో నడిచిన వ్యవహారం పై వస్తున్న ఆరోపణల కు ఎక్కడా ఆయన సమాధానం చెప్పలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు…? ఎవరు…? ఇచ్చారు వారు ఆరోపణలు ఇవి నా సమాధానాలు ఇవి అని ఎందుకు తమ ఛానెల్ ను విశ్వసించే వారికి నేరుగా చెప్పుకోలేక పోయారు. ఫోర్జరీ ఆరోపణలు తనపై ఎందుకు వచ్చాయి ? నిధులు దుర్వినియోగం రికార్డ్ ల గల్లంతు జరగలేదు ఇదిగో చిట్టా అని ప్రతీ ఆరోపణకు ఆధారాలు ఎందుకు జనం ముందు పెట్టలేదు ఇవన్నీ ఆయన నిజాయితీని సామాజిక మాధ్యమాల వేదికగా నిలదీసి అడుగుతున్నాయి. అయితే వీటికి ఈరోజు కాకపోతే రేపటికైనా ఆయన సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడుతుందన్న వాతావరణం మాత్రం స్పష్టం అవుతుంది.

Tags:    

Similar News