మేకపాటికి ఇబ్బందులు తప్పవా?
చిన్న వయసులో మంత్రి అయ్యారు. తండ్రి ప్రజల్లో నిత్యం ఉంటూ నేతగా ఎదిగారు. కానీ కుమారుడు మాత్రం తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. [more]
చిన్న వయసులో మంత్రి అయ్యారు. తండ్రి ప్రజల్లో నిత్యం ఉంటూ నేతగా ఎదిగారు. కానీ కుమారుడు మాత్రం తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. [more]
చిన్న వయసులో మంత్రి అయ్యారు. తండ్రి ప్రజల్లో నిత్యం ఉంటూ నేతగా ఎదిగారు. కానీ కుమారుడు మాత్రం తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. అదృష్టవశాత్తూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా ఆయన ప్రజలను, కార్యకర్తలను మాత్రం దూరం చేసుకుంటున్నారన్న టాక్ నియోజకవర్గంలో వినపడుతోంది. తండ్రి ఎన్నిమార్లు హిత బోధ చేసినా ఆయన మాత్రం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండరట. ఆయనే మేకపాటి గౌతమ్ రెడ్డి.
యువకుడు కావడంతో….
మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా గతంలో అనేకసార్లు విజయం సాధించారు. నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు. గత ఎన్నికల్లో మాత్రం రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా, తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైసీపీలోనే మేకపాటి కుటుంబం ఉండటంతో జగన్ కూడా తొలి మంత్రివర్గంలోనేు గౌతమ్ రెడ్డికి చోటు కల్పించారు. ప్రధానమైన ఐటీ, పరిశ్రమల శాఖను మేకపాటి గౌతమ్ రెడ్డకి కేటాయించారు.
రెండుసార్లు గెలిచినా…..
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండు దఫాలు గెలిచారు. అయితే రెండు సార్లు పార్టీకి ఉన్న ఊపుమీదే గెలిచారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరన్న అపవాదు ఉంది. మంత్రి అయ్యాక అది మరింత పెరిగింది. దీంతో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూరులో అడపా దడపా పర్యటిస్తూ కుమారుడు స్థానంలో తాను ఎమ్మెల్యేగా యాక్ట్ చేస్తున్నారట. ప్రజాసమస్యలను, కార్యకర్తల పనులను పరిష్కరంచేందుకు ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశారు.
అందరికీ దూరంగా….
అయితే ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డికి కూడా పట్టుంది. గతంలో ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం ఇటీవల ఎన్నికల్లో వెంకటగిరి షిఫ్ట్ అయ్యారు. ఇప్పటికీ ఆనం వర్గం ఆత్మకూరులో ఉంది. ఎన్నికల్లో ఆనం వర్గం మేకపాటికి పూర్తి మద్దతివ్వడంతోనే విజయం సాధ్యమయింది. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆనం వర్గాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో ఆనం వర్గీయులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదవుల విషయంలోనూ తమకు అన్యాయం జరిగిందంటున్నారు. మరోవైపు ప్రధాన శాఖకు మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాకు ఎలాంటి పరిశ్రమలు తేలేకపోయారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద యువనేత మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో చిక్కులు తప్పవంటున్నారు.