అయితే.. మాకేంటి..? అని అంటున్నారే?

ఆయ‌న సౌమ్యుడు, వివాద ర‌హితుడు, దూకుడు కూడా లేని నాయ‌కుడు.. పెద్దగా ఎవ‌రి విష‌యాల్లోనూ ఆయ‌న జోక్యం కూడా చేసుకోరు. అయిన‌ప్పటికీ.. ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. [more]

Update: 2021-08-28 12:30 GMT

ఆయ‌న సౌమ్యుడు, వివాద ర‌హితుడు, దూకుడు కూడా లేని నాయ‌కుడు.. పెద్దగా ఎవ‌రి విష‌యాల్లోనూ ఆయ‌న జోక్యం కూడా చేసుకోరు. అయిన‌ప్పటికీ.. ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. “ఈయ‌న వ‌ల్ల మాకేంటి ప్రయోజనం“ అంటూ.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ నుంచి మార్చేయాలి! అని కూడా నిర్ణయించుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, ఎంతో మంది ప్రముఖ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న రాజ‌కీయ కుటుంబం మేక‌పాటి ఫ్యామిలీ. మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండ‌గా.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు రాజ‌కీయాల‌ను మేనేజ్ చేశారు. ఎన్నేళ్లు రాజ‌కీయాలు చేసినా.. ఏనాడూ.. మ‌ర‌క‌లు అంటించుకోవ‌డం కానీ.. వివాదాల‌కు కేంద్రంగా మార‌డం కానీ.. మేక‌పాటి విష‌యం మ‌న‌కు క‌నిపించ‌వు. ఈ కుటుంబం నుంచి మేక‌పాటి వార‌సుడిగా రాజ‌కీయం అరంగేట్రం చేసిన మేకపాటి గౌతంరెడ్డిపై ఇప్పుడు విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

పెరిగిన వ్యతిరేకత….

ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న మేకపాటి గౌతంరెడ్డికి.. రాజ‌కీయ నేత‌ల‌తోనూ వారి వార‌సుల‌తోనూ ద‌గ్గర సంబంధాలు ఉన్నాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ‌తోనూ ఆయ‌న స‌న్నిహితంగానే మెలుగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌ద్ద మంచి ప‌లుకుబ‌డి ఉంది. అదేస‌మ‌యంలో కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌కు మేకపాటి గౌతంరెడ్డి క్లాస్‌మేట్ కూడా! స‌రే.. ఇదిలావుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో మేక‌పాటికి తిరుగులేదు. ఆయ‌న వరుస‌గా గెలిచారు. వైసీపీలో వివాద ర‌హిత నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. సీఎం జ‌గ‌న్ వ‌ద్ద మ‌రింత మంచి మార్కులే పొందారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క‌మైన ఐటీ శాఖ ద‌క్కింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం మేకపాటి గౌతంరెడ్డిపై వ్యతిరేక‌త పెరుగుతోంది.

వ్యాపారాలకే…?

దీనికి ప్రధానంగా రెండు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. ఒక‌టి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవడం. రెండు.. 'సార్ మా మ‌ధ్య ఈ వివాదం వ‌చ్చింది ప‌రిష్క‌=రించండి' అన్నా.. మేకపాటి గౌతంరెడ్డి ఉదాసీనంగా త‌ట‌స్థంగా వ్యవ‌హ‌రిస్తున్నా ర‌ట‌. దీంతో నేత‌లు ర‌గిలిపోతున్నారు. “గ‌త ఐదేళ్లలో మా పార్టీ అధికారంలో లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేప‌ట్టలేదు. దీనిని మేం కూడా అర్ధం చేసుకున్నాం. కానీ, ఇప్పుడు ఆయ‌న మంత్రి. ఇప్పుడు కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోకుండా .. ఎక్కువ కాలం హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇది త‌గునా?“ అనేది వైసీపీ నేత‌ల మాట‌. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం కంటే వ్యాపారాల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది.

నేతల మధ్య విభేదాలను కూడా…?

అదే స‌మయంలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నేత‌ల మ‌ధ్యత‌లెత్తుతున్న విభేదాల‌ను కూడా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప‌రిష్కరించ‌డం లేద‌నేది వీరి ఆవేద‌న‌. దీంతో అయ్యా.. మీరు మ‌మ్మల్ని ప‌ట్టించుకుంటే ఇక్కడ ఉండండి లేక‌పోతే.. మారిపోండి! అంటూ.. కామెంట్లు చేస్తున్నార‌ట‌. అయితే.. ఇంత‌గా త‌న‌పై వ్యతిరేక‌త ఉంద‌ని తెలిసి కూడా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మౌనంగా ఉంటుండ‌డంతో స్థానిక కేడ‌ర్ త‌ల ప‌ట్టుకుంటోంది.

Tags:    

Similar News