మేకపాటికి అంత ప్రయారిటీ… ఎందుకో తెలుసా?
మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చారు. మరో శాఖను కేటాయించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కోటరీలో [more]
మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చారు. మరో శాఖను కేటాయించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కోటరీలో [more]
మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చారు. మరో శాఖను కేటాయించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కోటరీలో ఒకరిగా పేరుంది. ఆయనకు తొలి విస్తరణలోనే మంత్రి పదవిని అప్పగించారు. కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలను జగన్ అప్పగించారు. తాజాగా పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖను కూడా జగన్ మేకపాటి గౌతమ్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.
రెండున్నరేళ్ల తర్వాత….
రెండున్నరేళ్ల తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క మంత్రిపదవి మాత్రమే ఖాళీ అవుతుందని, మేకపాటి గౌతమ్ రెడ్డి సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖనుంచి త్వరగా తప్పిస్తే రాష‌్ట్రంలో పెట్టుబడులు తగ్గే అవకాశముందని వారు విశ్లేషిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డిపై జగన్ పెద్ద బాధ్యతనే పెట్టారన్నారు. రానున్న కాలంలో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి కృషి చేయాల్సి ఉంటుంది.
తొలి నుంచి జగన్ తోనే….
మేకపాటి కుటుంబం తొలి నుంచి జగన్ తో నమ్మకంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే మేకపాటి కుటుంబం నడుస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం తొలి నుంచి వైసీపీలో చురుగ్గా ఉంది. గత ఎన్నికల సమయంలోనూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి అసహనం కన్పించలేదు. పార్టీని ముఖ్యంగా జగన్ కు అండగా ఉన్నారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది.
సీనియర్ నేతల్లో ఆందోళన…
మేకపాటి గౌతమ్ రెడ్డికి లభిస్తున్న ప్రయారిటీతో నెల్లూరు జిల్లాలో ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. నెల్లూరు జిల్లాలో లెక్కకు మించి నేతలు ఉన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో తమకు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి కి జగన్ ఇస్తున్న ప్రయారిటీ చూసి వచ్చే విస్తరణలో తమకు బెర్త్ దక్కడం అనుమానమేనన్న అసహనంతో ఉన్నారు. మరి మేకపాటిని కొనసాగిస్తే అనిల్ కుమార్ కు ఉద్వాసన తప్పదని, ఆ ఒక్క స్థానంలో అదృష్టం పరీక్షించుకుందామని సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద మేకపాటి గౌతమ్ రెడ్డికి లభిస్తున్న ప్రయారిటీ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.