మేకపాటికి ఇప్పటికీ ఆ ఆశ ఉందట

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయినప్పుడల్లా వైసీపీలో గుర్తుకొచ్చేనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఐదేళ్ల పాటు ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించారు. జగన్ పార్టీ [more]

Update: 2021-02-13 14:30 GMT

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయినప్పుడల్లా వైసీపీలో గుర్తుకొచ్చేనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఐదేళ్ల పాటు ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి వైసీపీ జెండాను వదలకుండా ఉన్నారు. పార్లమెంటులోనూ, ఢిల్లీలోనూ ఎంపీగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి జగన్ ఇబ్బందులు పడకుండా చేశారు. చంద్రబాబును ఢిల్లీ స్థాయిలో బదనాం చేయగలిగారు. జగన్ రాజీనామా చేయమని చెప్పిన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి గుడ్ బై చెప్పేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి.

కుటుంబానికి గుర్తింపు…..

అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు నెల్లూరు ఎంపీ టిక్కెట్ దక్కలేదు. టీడీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చి జగన్ ఆ కుటుంబాన్ని సంతృప్తి పర్చారు. అంతేకాదు అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు గౌతంరెడ్డికి మంత్రిపదవిని ఇచ్చారు.

రాజ్యసభ సీటు వస్తుందని….

దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తారని అందరూ ఊహించారు. ఇప్పటి వరకూ ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ పదవులు ఇతరులకు ఇచ్చారు. ఇద్దరు బీసీలకు, రెడ్డి సామాజికవర్గానికి ఒకరికి, పరిమళ్ నత్వానికి ఒక్క సీటును కేటాయించారు. ఇక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రస్తావనే రాలేదు. అయితే ఆయన ఇప్పటికీ పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. నెల్లూరు రాజకీయాల్లో పార్టీ నేతలకు సలహాలు ఇస్తున్నారు.

ఇప్పటికీ యాక్టివ్ గా…..

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కుమారుడు గౌతం రెడ్డి మంత్రి కావడంతో ఆయన ఎక్కువగా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే జగన్ తన విషయంలో అన్యాయం చేయడని, ఎప్పటికైనా తాను కోరుకున్న విధంగా రాజ్యసభ స్థానం దక్కుతుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరి భవిష‌్యత్ లో పెద్దాయనకు జగన్ ప్రయారిటీ ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News