Bjp : గాంధీ కుటుంబ వాసనే పడటం లేదా?

భారతీయ జనతా పార్టీలో గాంధీ కుటుంబం ఒకటి ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే మర్చిపోయినట్లున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగుతున్న సమయంలోనూ వారిని పక్కన పెట్టడం [more]

Update: 2021-10-08 16:30 GMT

భారతీయ జనతా పార్టీలో గాంధీ కుటుంబం ఒకటి ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే మర్చిపోయినట్లున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగుతున్న సమయంలోనూ వారిని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మేనకా గాంధీ రాజకీయంగా కాంగ్రెస్ కు ఎప్పుడో దూరమయ్యారు. తన భర్త సంజయ్ గాంధీ మరణం తర్వాత కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె జనతాదళ్ లో చేరారు. లోక్ సభ సభ్యురాలిగా కూడా గెలిచారు.

తొలి మంత్రివర్గంలో….

2014లో మేనకా గాంధీ బీజేపీలో చేరారు. కేంద్రంలో ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు. అయితే రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనకాగాంధీ కుటుంబాన్ని బీజేపీ దూరం పెట్టిందనే చెప్పాలి. మేనకాగాంధీ తో పాటు ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా ఈ లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. వారిద్దరూ బీజేపీకి ఏడేళ్ల నుంచి యూపీలో మంచి సపోర్ట్ ఇచ్చారు.

యూపీ ఎన్నికలు జరుగుతున్నా…..

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతున్న సమయంలోనూ వారికి ప్రాధాన్యత దక్కలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనకాగాంధీని మంత్రివర్గంలోకి కూడా తీసుకోలేదు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని నియమించింది. ఇందులో కూడా ఇద్దరికీ చోటు లభించలేదు. అనేక మందికి వివిధ రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో చోటు దక్కినా గాంధీ కుటుంబానికి మాత్రం ఎటువంటి పార్టీ పదవులు ఇవ్వలేదు.

కావాలనే పక్కన పెట్టారా?

దీంతో గాంధీ కుటుంబాన్ని కావాలనే బీజేపీ పక్కన పెట్టిందన్న విమర్శలున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ మేనకాగాంధీకి పార్టీ పదవి ఇస్తారని అందరూ భావించారు. కానీ వారిని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని కసరత్తు చేసే రూపొందించారు. దాదాపు మూడు వందల మందికి చోటు కల్పించినా వీరి కుటుంబానికి పదవులు ఇవ్వక పోవడంతో ఆ ప్రభావం యూపీ ఎన్నికలపై ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News