టీడీపీకి ఆ వర్గం దూరమవుతోందా.. లేటెస్ట్ బిగ్ షాక్ ?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, ఫైర్ బ్రాండ్.. శోభా హైమావతి పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మైనార్టీ [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, ఫైర్ బ్రాండ్.. శోభా హైమావతి పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మైనార్టీ [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, ఫైర్ బ్రాండ్.. శోభా హైమావతి పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మైనార్టీ వర్గానికి చెందిన కీలక నాయకుడు, మంచి పేరున్న నేత జంప్ చేసేశారు. గుంటూరు జిల్లాకు చెందిన దివంగత నాయకుడు, లాల్ జాన్ బాషా సోదరుడు.. జియావుద్దీన్ సైకిల్ దిగేశారు. ఆయన నేరుగా వైసీపీలోకి చేరిపోయారు. సుదీర్ఘకాలంగా మైనార్టీ వర్గాన్ని టీడీపీ వెంట నడిపించిన కుటుంబంగా బాషాలకు పేరుంది. లాల్‌జాన్-జియావుద్దీన్‌లు ఇద్దరూ కూడా టీడీపీని ఒకప్పుడు గుంటూరులో అభివృద్ది బాట పట్టించారనే పేరు తెచ్చుకున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా మెలిగారు.
రెండు సార్లు…
ఈ క్రమంలోనే జియావుద్దీన్ 1994, 1999లో గుంటూరు 1 నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఇక, 2004, 2009లో ఆయన ఓడిపోయినా.. పార్టీ వెంటే నడిచారు. ఈ క్రమంలోనే 2014, 2019లో టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పనిచేశారు.ఇక, అతికష్టమ్మీద అన్నట్టుగా 2017లో చంద్రబాబు ఆయనకు మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అయినా.. తనకు టికెట్ ఇవ్వాలని జియావుద్దీన్ పట్టుబడుతున్నారు. దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా లేకపోగా.. పార్టీ పరంగా ఈ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వ్యూహాత్మకంగా .. టీడీపీని బలహీన పరిచే చర్యలకు పూనుకున్నారు.
వైసీపీలో చేరడంతో….
దీంతో జియా వుద్దీన్.. వైసీపీలోకి చేరిపోయారు. జియా వుద్దీన్ చేరిక మైనార్టీ వర్గాన్ని టీడీపీకి దూరం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మైనార్టీలు ఆ పార్టీ వెంటే ఉంటూ వస్తున్నారు. దీనిని తమవైపు తిప్పుకొనేందుకు టీడీపీ ఇప్పటికే అనేక రూపాల్లో ప్రయత్నించింది. అయితే.. బలమైన నాయకులను బలోపేతం చేయడం లో చంద్రబాబు విఫలం కావడం.. మైనార్టీ కమిషన్ ఖాళీగా ఉన్నప్పటికీ.. పార్టీ అధికారం కోల్పోవడానికి రెండేళ్లముందు ఈ పదవిని ఇవ్వడం.. పైగా లాల్ జానా బాషా వంటి నేతల కుటుంబాలకు కూడా ప్రాధాన్యం లేకపోవడం వంటి పరిణామాలు టీడీపీకి మైనార్టీ వర్గాలను దూరం చేసేశాయి.
చెప్పుకునేందుకు?
ఈ పరిస్థితి ఇప్పటకీ మారకపోతే పార్టీలో చెప్పుకునేందుకు పేరున్న మైనార్టీ నేతలు కూడా ఉండరనే అంటున్నారు. మరి దీనిని నివారించేందుకు పార్టీపరంగా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. 2014లో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇలాగే కొనసాగితే.. మున్ముందు.. 15 శాతం గా ఉన్న ముస్లింలు.. 5 శాతంగా ఉన్న వారి ఓటు బ్యాంకు టీడీపీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.