అశ్వద్ధామ మూవీ రివ్యూ
అశ్వద్ధామ మూవీ రివ్యూ బ్యానర్: ఐరా క్రియేషన్స్ నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, సత్య, ప్రిన్స్, జయ ప్రకాష్, పోసాని, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ [more]
అశ్వద్ధామ మూవీ రివ్యూ బ్యానర్: ఐరా క్రియేషన్స్ నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, సత్య, ప్రిన్స్, జయ ప్రకాష్, పోసాని, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ [more]
అశ్వద్ధామ మూవీ రివ్యూ
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, సత్య, ప్రిన్స్, జయ ప్రకాష్, పోసాని, సురేఖ వాణి, పవిత్ర లోకేష్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీచరణ్ పాకాల
బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రాన్
నిర్మాత: ఉష మూల్పూరి
కథ: నాగ శౌర్య
దర్శకత్వం: రమణ తేజ
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణవైభోగమే, ఒకమనసు, ఛలో, ఓ బేబీ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగశౌర్య హిట్స్ కొట్టినప్పటికీ… మాస్ అంటూ చేసిన సినిమాల్తో చేతులు కాల్చుకున్నాడు. మళ్ళీ ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో ఛలో అంటూ లవ్ స్టోరీ తో హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత నాగ శౌర్య మల్లి మాటిచ్చానని ఓ డిజాస్టర్ మూవీ చేసాడు. నాగ శౌర్య కెరీర్ లోనే నర్తనశాల భారీ డిజాస్టర్ అయిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత మల్లి నిజ జీవిత ఘటన ఆధారంగా నాగ శౌర్యనే ఓ కథ రాసుకుని.. తన ఫ్రెండ్ రమణ తేజ తో అశ్వద్ధామ అనే సినిమాని మళ్ళీ ఓన్ ప్రొడక్షన్ లోనే తెరకెక్కించాడు. కథ ఓన్, బడ్జెట్ ఓన్, మరి హీరో గా కూడా చేసిన నాగ శౌర్య ఈ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడా? మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో డిఫెరెంట్‌గా కనిపిస్తున్న నాగశౌర్య ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకున్నాడు? నాగ శౌర్య చేసిన ప్రమోషన్స్ తో ఈ సినిమాపై ప్రేక్షకులు పెంచుకున్న ఆసక్తికి నాగ శౌర్య న్యాయం చేశాడా? మరి ఈ సినిమాతో నాగ శౌర్య ఎలాంటి హిట్ కొట్టాడు? అనేదిసమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అనుకోకుండా కొంత మంది అమ్మాయిలు సృహ తప్పి పడిపోవడం, హాస్పిటల్ లో జాయిన్ అవడం.. అక్కడ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం.. లాంటి గందరగోళంలో ఆ అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారో తెలియక ఆ అమ్మాయిలంతా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇదే నేపథ్యంలో గుణ(నాగశౌర్య) చెల్లెలు పెళ్ళికుదరడంతో.. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంగేజ్మెంట్ రోజునే గుణ చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడడంతో.. గుణ కి ఏం అర్ధం కాదు. అసలు అమ్మాయిలకు ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? దాని మూలంగా గుణ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అసలు ఈ దారుణ ఘటనల వెనుక ఉన్నది ఎవరు? వీటన్నిటికీ గల ప్రధాన కారణం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
లవర్ బాయ్ లుక్ లో కనిపించిన నాగ శౌర్య ఈ చిత్రం ద్వారా తనలోని మాస్ యాంగిల్ అద్భుతంగా పోషించాడని చెప్పాలి. లుక్స్ పరంగా, నటన పరంగా నాగ శౌర్య ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ తన టాకీ వరకు ఒకే అని చెప్పొచ్చు. ఎక్స్ ప్రెషన్స్ కోసం పెద్దగా కష్టపడకుండా తనకు వచ్చిన నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే శౌర్య చెల్లెలు పాత్రలో కనిపించిన నటి మంచి నటన కనబర్చింది. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన వ్యక్తి అయితే ఆ విలనిజంలో క్రూరత్వాన్ని మొహం చూపించకుండానే చూస్పిస్తాడు. అతనిపై వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను ఇస్తాయని చెప్పాలి. మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
హీరో గానే కాదు..ఇప్పుడు రైటర్ గాను నాగ శౌర్య తన సత్తా చాటాడు. సినిమాకు అత్యంత కీలకమైన పార్ట్ కథను తానే అందించి ఈ సినిమాకు ప్రధాన ఎస్సెట్ గా మారాడు నాగ శౌర్య. ఓ ఇంట్రస్టింగ్ పాయింట్‌తో కథను అల్లుకున్నాడు హీరోగారు. అయితే దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే హీరో క్యారెక్టరైజేషన్ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. తాను రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దానిని తెరకెక్కించే విధానం కాస్త నెమ్మదించింది అని చెప్పాలి. అందుకే ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే కాస్త బెటర్ గా ఉంటుంది అని చెప్పాలి. మెయిన్ విలన్ ఎంట్రీతో పాటుగా సినిమా మెయిన్ థీమ్ లోకి ఇక్కడ నుంచే వెళ్తుంది. విలన్ ఎవరన్న ఆసక్తి కలిగించేలా అక్కడక్కడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించి.. కీలకమైన ట్విస్ట్‌తో విలన్ ఎంట్రీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే దీనికి సరైన ట్రీట్మెంట్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో పడలేదని చెప్పాలి. దర్శకుడు స్క్రీన్ ప్లై అనుకున్నంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఇదే ఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక మిగతా అన్ని సన్నివేశాలు బాగానే తెరకెక్కించినా స్లో నరేషన్ మూలాన ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ కలగకపోవచ్చు. అశ్వథ్థామ కాన్సెప్ట్ బాగున్నా… దానిని తెరకెక్కించే విధానంలో దర్శకుడు రమణ తేజ విఫలం అయ్యాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు పలు సీన్స్ బాగానే ఉన్నా… అంత ఆసక్తికరంగా సాగని కథనం మాత్రం సినిమాని దెబ్బేసింది.
సాంకేతికంగా..
జీబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ కాగా.. శ్రీచరణ్ పాకాల సాంగ్స్‌కి న్యాయం చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ కాగా.. ఎడిటింగ్ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.
రేటింగ్: 2.0/5