వన్ ఇయర్ ఎఫెక్ట్.. బాలయ్య పై భారీగానేనట
నటసింహం నందమూరి బాలకృష్ణ.. రెండోసారి జగన్ సునామీని తట్టుకుని మరీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాది పూర్త యింది. అనంతపురం జిల్లాలోని టీడీపీకి కలిసి వచ్చిన నియోజకవర్గం [more]
నటసింహం నందమూరి బాలకృష్ణ.. రెండోసారి జగన్ సునామీని తట్టుకుని మరీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాది పూర్త యింది. అనంతపురం జిల్లాలోని టీడీపీకి కలిసి వచ్చిన నియోజకవర్గం [more]
నటసింహం నందమూరి బాలకృష్ణ.. రెండోసారి జగన్ సునామీని తట్టుకుని మరీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాది పూర్త యింది. అనంతపురం జిల్లాలోని టీడీపీకి కలిసి వచ్చిన నియోజకవర్గం నుంచి బాలయ్య 2014లో తొలిసారి అరంగేట్రంతోనే అదరకొట్టారు. ఇక, గత ఏడాది రెండోసారి కూడా ఆయన విజయ దుంధుభి మోగించారు. అయితే, 2014కు, 2019కి మధ్య చా లా వ్యత్యాసం ఉంది. 2014నుంచి ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన కనిపించకపోయినా పనులు జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చిన్నపాటి వివాదాలు మినహా.. ఆయన పెద్దగా మైనస్ అయింది లేదు. నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు ఉరుకులు పరుగులు పెట్టించడంతో పాటు ఎన్టీఆర్ మానసపుత్రిక హంద్రీనీవా జలాలు రప్పించడం, లేపాక్షి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడం చేశారు.
ఇక్కడే ఉంటానంటూ….
అయితే, స్థానికంగా ఉండరనే పెద్ద అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో 2019 ఎన్నికల సమయంలో ఎన్నడూ రోడ్డెక్కని ఆయన సతీమణిని కూడా తీసుకు వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు అంటూ.. వాటి అడ్రస్‌లను హిందూపురానికి మార్చుకున్నారు. ఇకపై ఇక్కడే ఉంటానంటూ.. ఓ ఇల్లు కూడా నిర్మించుకున్నారు. దీంతో బాలయ్యపై విశ్వాసంతో మరో 900 అధిక ఓట్లు వేసి 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగానే బాలయ్య విజయం సాధించేలా ఇక్కడి ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. కట్ చేస్తే.. ఏడాది గడిచిపోయింది. మరి ఈ ఏడాది కాలంలో బాలయ్య ఏమేరకు పుంజుకున్నారనేది ఇక్కడి ప్రధానంగా చర్చకు వస్తోంది.
వైసీపీ వ్యూహాత్మకంగా…..
ప్రస్తుతం జగన్ పాలన సాగుతోంది. గతంలో మాదిరిగా బాలయ్య లేకుండా నియోజకవర్గంలో పనులు చేసే పరిస్థితి ఇక్కడ కని పించడం లేదు. వైసీపీలో చిన్నపాటి విభేదాలు పక్కన పెడితే ప్రస్తుతానికి బాగానే ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ దూకుడు పెరగడంతో వైసీపీ నేతల హవా పెరిగింది. అయితే మాజీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ వర్గం కూడా బలంగా ఉండడంతో గ్రూపుల గోల ఎక్కువైంది. అదే సమయంలో బాలయ్య ఇక్కడ ఉంటానని చెప్పినా.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. షూటింగులు, సినిమాలతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రజలను చేరువ చేసుకునేందుకు, ముఖ్యంగా మైనార్టీ వర్గాలను తనవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారం సక్సెస్‌గా ముందుకు సాగుతోంది.
చేజారిపోతుందా?
స్థానికంగా బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మాట వినే అధికారి అంటూ లేకుండా పోయారు. దీంతో బాలయ్య హిందూపురానికి నామ్ కే వాస్తే ఎమ్మెల్యేగా మారిపోయాడు. ఈ గ్యాప్‌లో అయినా బాలయ్య పుంజుకుంటారని భావించినా.. ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో టీడీపీ తరఫున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే వారు కరువయ్యారు. గత ఏడాది నవంబరులో బాలయ్య నియోజకవర్గానికి సొంత పనిపై వచ్చినప్పుడు రైతులు ఆయనను అడ్డగించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బాలయ్య పుంజుకోవాలనేది టీడీపీ నేతల సూచన. లేకపోతే..ఎంత పటిష్టంగా ఉన్న నియోజకవర్గం అయినా.. చేజారిపోవడం ఖాయమని చెబుతున్నారు. మరి బాలయ్య ఎలా ముందుకు వెళ్తారో ? చూడాలి.