బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ రాజకీయం ముగిసినట్టేనా ?
తెలుగుదేశం పార్టీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్లేస్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా హిందూపురంలో బాలకృష్ణ వరుసగా రెండోసారి.. అది [more]
తెలుగుదేశం పార్టీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్లేస్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా హిందూపురంలో బాలకృష్ణ వరుసగా రెండోసారి.. అది [more]
తెలుగుదేశం పార్టీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్లేస్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా హిందూపురంలో బాలకృష్ణ వరుసగా రెండోసారి.. అది కూడా గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించారు. బాలకృష్ణ పార్టీలో మరింత పెద్ద పదవి కోసం ప్రయత్నిస్తున్నా అవి నెరవేరేలా లేవు. ఇదిలా ఉంటే బాలకృష్ణ కూడా బాబు వద్ద లాబీయింగ్ చేసి మరీ కొందరు నేతలకు టిక్కెట్లు ఇప్పించుకున్నది నిజం. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు లాంటి వాళ్లు బాలయ్యకు బెస్ట్ ఫ్రెండ్సే.
వీరికి టిక్కెట్లను..?
వీరికి 2009లో టిక్కెట్లు రావడంలో బాలకృష్ణదే కీలక పాత్ర. వెలగపూడి రామకృష్ణ మూడు సార్లు వరుస విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దూసుకు పోతున్నారు. ఇక కదిరి బాబూరావుకు 2009లో సీటు ఇచ్చినా నామినేషన్ స్క్రూటినీలో పోయింది. 2014లో కనిగిరి నుంచి గెలిచిన ఆయన గత ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినా కొన్నిసార్లు బాబుపై ఆయన అసహనంతోనే ఉండేవారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాబూరావు సైకిల్ దిగేసి వైసీపీ కండువా కప్పేసుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడే…?
పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన కనిగిరి ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శ ఉంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారాల్లో బిజీ అయ్యేవారు. ఇక గత ఎన్నికల్లో బాలకృష్ణ సిఫార్సును లెక్క చేయకుండా బాబు సైతం ఆయన్ను కనిగిరి నుంచి కాకుండా దర్శి నుంచి పోటీ చేయించినప్పుడే ఆయన అసహనంతో ఉన్నారు. కనిగిరి సీటు బాబూరావుకు ఇవ్వవద్దనే అక్కడ పార్టీ కేడర్ నానా రాద్దాంతం చేసింది. గత ఎన్నికల్లో బాబు కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డికి, దర్శి నుంచి కదిరి బాబూరావుకు, ఒంగోలు ఎంపీగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకు సీట్లు ఇస్తే ముగ్గురూ ఓడిపోయారు.
వైసీపీలో చేరినా…?
వీరిలో శిద్ధా, ఆయన వారసుడు ఆ వెంటనే కదిరి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. పార్టీ మారిన శిద్ధా లాంటి నేతలకే ప్రయార్టీ లేదు. టీడీపీలో ఉండగా ఆయన మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన్నే పట్టించుకోవడం లేదు. ఇక బాబూరావు లాంటి నేతలను జిల్లా స్థాయి నేతలు కూడా గుర్తుంచుకునే పరిస్థితి లేదు. అయితే బాబూరావు ఏ ఉద్దేశంతో పార్టీలో చేరారో కాని.. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనపడడం లేదు. మళ్లీ ఆయన హైదరాబాద్‌కే పరిమితమై అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆయన టీడీపీలో ఉండి ఉంటే కనీసం ఏదో ఒక నియోజకవర్గం అయినా చేతిలో ఉండేది.. ఇప్పుడు ఏదీ గతి లేని పరిస్థితి ..!