లోకేష్ తో గ్యాప్ వస్తే ఇక అంతేనట.. ?

తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రభావం ఎక్కువై సీనియర్లు మదన పడుతున్న సంగతి తెలిసిందే. వారికి చంద్రబాబుతోనే డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. చినబాబు ఇంకా లైట్ గానే తీసుకుంటున్నారు. [more]

Update: 2021-07-17 13:30 GMT

తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రభావం ఎక్కువై సీనియర్లు మదన పడుతున్న సంగతి తెలిసిందే. వారికి చంద్రబాబుతోనే డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. చినబాబు ఇంకా లైట్ గానే తీసుకుంటున్నారు. తమకు బాబు ఉన్నారు అన్న ధీమాతోనే బతికేస్తున్నారు. అయితే టీడీపీలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. చంద్రబాబు అధినాయకుడిగా ఉండగానే లోకేష్ మరో వైపు గట్టిగానే చక్రం తిప్పేస్తున్నారు. మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయన ఇప్పటి నుంచే ఆశావహులకు బాగానే హామీలు ఇస్తున్నారుట.

సొంత టీమ్ తో….

లోకేష్ తనకంటూ ఒక సొంత టీమ్ ని తయారు చేసుకుంటున్నారు. ఆయన పెదవి దాటని పన్ను లాంటి యువకులకే అందులో చోటు కల్పిస్తున్నారుట. వీరిలో చాలా మంది సీనియర్ నేతల వారసులే కావడం విశేషం. అంటే తండ్రులకు అలా చెక్ పెట్టేస్తున్నారు అన్న మాట. ఇంకా తమకు వయసు ఉందని పోటీ చేస్తామని పెద్ద తలకాయలు అనుకుంటే లోకేష్ నిర్ణయమే అక్కడ ఫైనల్ అంటున్నారు. ఆయన మాటకు బాబు కూడా అడ్డు చెప్పరు కాబట్టి తల పండిన వారంతా ఇక ఇళ్ళకే అన్న మాట వినిపిస్తోంది.

వీరంతా అటే….

ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాలను తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర శివాజీ కుమార్తె శిరీష, కూన రవికుమార్, విజయనగరంలో కిమిడి నాగార్జున, ద్వారపురెడ్డి జగదీషి, గుమ్మడి సంధ్యారాణి, విశాఖ నుంచి మాజీ మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్, బండారు సత్యనారాయాణమూర్తి అప్పలనాయుడు, కిడారి శ్రావణ్ వంటి వారికి ఈసారి టికెట్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది. అలాగే మరింత మంది యువకులకు టికెట్లు ఇచ్చేందుకు లోకేష్ హామీ ఇస్తున్నారుట.

గ్యాప్ ఉంటే అంతే…?

లోకేష్ కి చంద్రబాబుకు తేడా ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. చంద్రబాబుని ఎవరైనా ఏమైనా అన్నా కానీ ఆయన దగ్గరకు వెళ్ళి మళ్లీ పనిచెస్తామంటే ఓకే అనేస్తారు. కానీ లోకేష్ వద్ద అలా కాదు, ఆయన అన్నీ గుర్తుంచుకుంటారు అంటున్నారు. గతంలో తన పరోక్షంలో కామెంట్స్ చేసిన వారిని ఆయన గుర్తుంచుకున్నారని, వారిని అసలు చేరదీయరు అంటున్నారు. వారు ఎంతటి పెద్ద నాయకులు అయినా కూడా టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సుముఖంగా ఉన్నా లోకేష్ పడనివ్వరు అంటున్నారు. మొత్తానికి లోకేష్ తో ఇప్పటికే గ్యాప్ ఎవరికైనా ఉంటే వారు టీడీపీ మీద ఆశలు వదిలేసుకోవచ్చు అని పసుపు పార్టీలో మారుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి.

Tags:    

Similar News