బలహీనతను బయటపెట్టారా?
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న వారు.. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే. [more]
;
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న వారు.. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే. [more]
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న వారు.. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే. అయితే.. దీనిని మించి.. అన్నట్టుగా నారాయణ స్వామి దూకుడు చూపించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసి.. కనీసం రెండు స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకుంటే.. తాను చంద్రబాబు ఇంట్లో పాకీ పనిచేస్తానని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఏ పార్టీతోనూ బహిరంగ పొత్తులు పెట్టుకోలేదు. అదే సమయంలో ఇతర పార్టీలు కూడా దాదాపు ఒంటరిగానే పోటీ చేశాయి.
సింహం సింగిల్ అంటూ…
ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ 151 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపని.. ఎవరు ఎన్ని కూటములు కట్టినా.. అంతిమ విజయం ప్రజాసర్కారుగా ఉన్న తమకే దక్కుతుందని.. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. తమపై దండెత్తే పార్టీలను ఉద్దేశించి.. సింహం సింగిల్‌గా వస్తుందని.. ఇటీవలే మంత్రి పేర్ని నాని.. వ్యాఖ్యానించారు.
సంక్షేమ కార్యక్రమాలపైనే….
అంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ+జనసేన+బీజేపీ+ వామప క్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా… జగన్‌ను ప్రజలు దీవిస్తారని.. చెప్పుకొచ్చారు. దీనికి సంబందించి ఆయన జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీలో ఇతర నేతలు కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జగన్ సర్కారును ప్రజలు మళ్లీ దీవిస్తారని.. ఎక్కడ అవకాశం వచ్చినా.. చెబుతున్నారు. అయితే.. దీనికి భిన్నంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. వ్యాఖ్యానించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే.. ఎక్కడా గెలవదని.. చెప్పారు. అంటే.. టీడీపీ కనుక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ఖచ్చితంగా గెలిచి తీరుతుందనే భావం ఆయన మాట్లల్లో వ్యక్తం అవుతోంది.
కూటమి కడితే?
దీనిని బట్టి.. టీడీపీకి ముందుగానే నారాయణ స్వామి క్లూ ఇచ్చారా ? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అదేసమయంలో వైసీపీ నేతలు చెబుతున్నట్టు.. ఎవరు ఎన్నికూటములు కట్టినా.. జగన్‌ను ఓడించడం సాధ్యంకాదు. కానీ, ఇదే సమయంలో నారాయణ స్వామి మాత్రం కూటములు కడితే.. మాకు ప్రమాదమే .. అన్న సంకేతాలు పంపేశారని ఇది మంచి పరిణామం కాదని.. పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతల్లో టీడీపీ – జనసేన కలిస్తే తమకు ప్రమాదం అన్న భయాందోళనలు ఇప్పటికే ఉన్నాయి. ఒంటరిగా ఉంటేనే టీడీపీని ఓడిస్తామంటే.. వైసీపీ బలహీనత బయటపడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.