అధికారులే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా ?
ప్రభుత్వాలు అయిదేళ్ళకు ఓ మారు మారుతూంటాయి. దాంతో పాటే ఆయా ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతాయి. అయితే పనిచేసే అధికారులు మాత్రం కనీసం మూడున్నర దశాబ్దాల పాటు అక్కడే [more]
ప్రభుత్వాలు అయిదేళ్ళకు ఓ మారు మారుతూంటాయి. దాంతో పాటే ఆయా ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతాయి. అయితే పనిచేసే అధికారులు మాత్రం కనీసం మూడున్నర దశాబ్దాల పాటు అక్కడే [more]
ప్రభుత్వాలు అయిదేళ్ళకు ఓ మారు మారుతూంటాయి. దాంతో పాటే ఆయా ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతాయి. అయితే పనిచేసే అధికారులు మాత్రం కనీసం మూడున్నర దశాబ్దాల పాటు అక్కడే పనిచేస్తారు. వారికి నియమాలు, నిబంధనలు అన్నీ తెలుసు. ఏ పని చట్టబద్దం, మరి ఏది కాదు అన్నది అధికారులే ప్రజా ప్రథినిధులకు సలహా ఇచ్చి దారి చూపాలి. కానీ చాలా మంది అధికారులు రాజకీయ చొక్కాలు వేసుకుంటూ భజన చేస్తూ దానిలోనే తరించేస్తున్నారు. దాంతో ఫలనా అధికారి ఆ పార్టీ సానుభూతిపరుడు అన్న పేరు వచ్చేస్తోంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు మారినపుడల్లా తమకు అనుకూలమైన అధికార్లను ఎంపిక చేసుకోవడం జరుగుతోంది. ఇది ఎంతవరూ దారితీస్తోందంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ఒక టీమ్ గా ప్రజల మంచి కోసం పనిచేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా పెత్తనం చేయడానికే ప్రాధ్యావ్యత ఇస్తున్నారు.
అక్రమాలకు అసలు కారణం :
ఇక పాలనాపరంగా జరిగే తప్పులకు ప్రజా ప్రతినిధుల కంటే అధికారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సివుంటుంది. గైడ్ లైన్స్ పక్కా క్లారిటీగా ఉన్నా సరే అధికారులు మంత్రులు, ముఖ్యమంత్రుల మెప్పు కోసం వాటిని పక్కన పెట్టేసి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ తరువాత పర్యవసానాలకు తమకు బాధ్యత లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. దీని వల్ల ప్రజలకే ఎంతో నష్టం జరుగుతోంది. దేశంలో చట్టాలు సక్రమంగా అమలు చేయాలంటే అధికారులే గట్టి పట్టుదలగా ఉండాలి. రాజకీయ వత్తిళ్ళు ఎన్ని ఉన్నా కూడని పని అయినపుడు ససేమిరా అనాల్సిందే. అలా చేయకపోవడం వల్లనే గతంలోనూ ఇప్పుడు కూడా అధికారులు పాపాల భారాన్ని మోయాల్సివస్తోంది.
ప్రజా వేదిక వ్రుధా ఎవరి పాపం :
ప్రజా వేదిక అక్రమ ప్రదేశం లో కట్టిన కట్టడం అన్నది అందరికీ తెలిసిందే. మరి పర్యావరణ చట్టం గురించి ఐఏఏస్ అధికారులకు తెలియదు అనుకోగలమా. వారిని అన్ని విషయాలు తెలిసినా నాడు క్రిష్ణా నది కరకట్ట మీద అక్రమ కట్టడాలకు ఎందుకు అనుమతించారు, ఇపుడు జగన్ సర్కార్ రాగానే అది అక్రమమేనంటూ ఎందుకు కూలగొట్టారు. అప్పుడు ఇప్పుడు ఉన్నది అధికారులే. ఆనాడే నిజం చెప్పి అక్కడ నిర్మాణాలు నిలుపు చేయిస్తే ఇప్పుడు ఈ కూలగొట్టడం ప్రజా ధనం వ్రుధా కావడం అన్నది తప్పుతుంది కదా. ఇక అధికారులు తమకు నచ్చని పని రాజకీయ నాయకులు చేయించినపుడు అది కచ్చితంగా నోట్ చేసి తీరాలి. తమ డిసెంట్ ని వెల్లడించాలి. దాని వల్ల భవిష్యత్తులో ఎటువంటి విచారణ జరిగినా అధికారులకు ఆ పాపం అంటకుండా ఉంటుంది. కానీ జరుగుతునందేమింటే పార్టీ కార్యకర్తల కంటే కూడా అధికారులే ప్రభుత్వాధినేతలకు సన్నిహితమైపోతున్నారు. వారికే చక్క భజన చేస్తున్నారు. దీనివల్లనే ఇలాంటి తప్పుడు పనులు జరుగుతున్నాయి. ప్రజావేదిక కూల్చడంపై సోషల్ మీడియాలో అసలు దోషులు అధికారులేనని తీర్పు చెబుతోందంటే అధికారులు తమ పనితీరును ఎంతలా మార్చుకోవాలో సూచిస్తోంది. అధికారులూ ఇకనైనా మారతారా.