టిక్…టిక్..టిక్.. ఇంకా కొద్ది గంటల్లోనే?
తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుందని కొద్దిసేపటి వరకూ అనుకున్నాం. నిజానికి ఈనెల 31వతేదీన రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటించాల్సి ఉంది. ఆయన డిసెంబరు 31వ [more]
తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుందని కొద్దిసేపటి వరకూ అనుకున్నాం. నిజానికి ఈనెల 31వతేదీన రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటించాల్సి ఉంది. ఆయన డిసెంబరు 31వ [more]
తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుందని కొద్దిసేపటి వరకూ అనుకున్నాం. నిజానికి ఈనెల 31వతేదీన రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటించాల్సి ఉంది. ఆయన డిసెంబరు 31వ తేదీన పార్టీని ప్రకటిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు రాజకీయ పార్టీలు రజనీకాంత్ కొత్త పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 31వ తేదీన రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారా? లేక పార్టీ ప్రకటన తేదీని వెలువరిస్తారా? అన్నదానిపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను పార్టీ ని ఇప్పట్లో ప్రకటించేది లేదని రజనీకాంత్ తెలిపారు.
వాస్తవానికి రేపు ప్రకటన…..
తమిళనాడులో మరో ఐదారు నెలలో ఎన్నికలు జరగనున్నాయి. రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రజనీకాంత్ తన పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పేరును, గుర్తును కూడా రజనీకాంత్ స్వయంగా ప్రకటించాల్సి ఉండటంతో వాటిని గోప్యంగా ఉంచారు. అయితే కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి గా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ పార్టీ గుర్తు ఆటోగా కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఆయన ఆలోచనను విరమించుకున్నారు.
జనవరి నెలలో….
అయితే రజనీకాంత్ జనవరి నెలలో పార్టీ పేరును, గుర్తును ప్రకటిస్తారని మక్కల్ మండ్రం నేతలు చెప్పుకొచ్చారు. జనవరి 17వ తేదీన ఆయన పార్టీ పేరును ప్రకటించే అవకాశముందని కూడా వార్తలు వచ్చాయి. త్రై మాసం కావడంతో శుభసూచికమని అంటున్నారు. జనవరి 17వ తేదీ ఎంజీఆర్ పుట్టిన రోజు కావడంతో అదే రోజు రజనీకాంత్ పార్టీ పేరును, గుర్తును ప్రజలకు పరిచయం చేసే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. అదే రోజు నుంచి తమిళనాడు మొత్తం వారం రోజుల పాటు పార్టీ ఆవిర్భోత్సవ వారోత్సవాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
అభిమానుల్లో నిరాశ….
రజనీకాంత్ పార్టీ ప్రకటన కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు.కానీ రజనీకాంత్ ఆకస్మిక ప్రకటన అభిమానులను నిరుత్సాహ పర్చింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇప్పట్లో పార్టీని ప్రకటించలేనని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో ఇక తమిళనాడులో రజనీకాంత్ పార్టీ వచ్చే అవకాశాలు లేనట్లే కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల వత్తిడి మేరకే రజనీకాంత్ పార్టీ ప్రకటనను విరమించుకున్నారు.