రజనీ రాంగ్ బటన్.. ఆ ఇద్దరూ ఖుషీ
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడినట్లే. తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2021 లో జరగాల్సి ఉంది. ఈసారి జరిగే ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే [more]
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడినట్లే. తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2021 లో జరగాల్సి ఉంది. ఈసారి జరిగే ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే [more]
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడినట్లే. తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2021 లో జరగాల్సి ఉంది. ఈసారి జరిగే ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జయలలిత లేని అన్నాడీఎంకే, కరుణానిధి లేని డీఎంకేలు ఈ ఎన్నికలను ఎదుర్కొనపోతున్నాయి.
కొత్త పార్టీ ప్రకటన లేటుతో…..
అయితే తమిళనాడులో రజనీకాంత్ కొత్త పార్టీ రానుంది. ఇప్పటికే తాను రాజకీయాల్లోకి రానున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. ఆయన తాను కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు 2017లోనే ప్రకటించారు. ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయాయి. పార్టీ పేరు ప్రకటించకపోయినా తాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. అదే సమయంలో తనకు సీఎం అవ్వాలనే ఉద్దేశ్యం కూడా లేదని కూడా స్పష్టం చేశారు.
కరోనా తగ్గేసరికి….
ప్రస్తుతం కరోనా మహమ్మారి తమిళనాడు ను చుట్టుకుంది. మరో ఆరు నెలల పాటు కరోనా వైరస్ నుంచి తమిళనాడు మాత్రమే కాదు దేశం మొత్తం బయటపడే అవకాశం లేదు. దీంతో దాదాపు డిసెంబరు వరకూ కరోనాతోనే తమిళనాడు రాజకీయ నేతలు కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. బలమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ రజనీకాంత్ పార్టీ ఇంకా వేళ్లూనుకోలేదు.
అంత సమయం ఉంటుందా?
రజనీకాంత్ పార్టీని ప్రకటించి బలగాలను సిద్ధం చేసుకునే సమయం ఉంటుందా? అన్నది ఆయన అభిమానుల్లో తలెత్తుతున్న సందేహం. ఎందుకంటే కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ స్థాయికి చేరుకునే సరికి 2021 వచ్చేస్తుంది. ఇక రజనీకాంత్ పార్టీ ప్రకటించేదెప్పుడు? ఎన్నికలకు సిద్ధమయ్యేదెప్పుడు? అన్న చర్చ జోరుగా సాగుతుంది. డీఎంకే, అన్నాడీఎంకేలు మాత్రం జరుగుతున్న పరిణామాలను చూసి కొంత ఊపిరిపీల్చుకున్నాయి. రజనీ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో తమపై ఉండదన్న ఆశాభావంతో ఉన్నాయి.