సర్దుకున్నారా? కాదు పొమ్మన్నారా?

ఇంతకీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారతారా? లేరా? ఆయన ఢిల్లీ పెద్దలను ఎందుకు కలవలేదు? కలుస్తానంటే ఢిల్లీ పెద్దలే ఆయనను దూరం పెట్టారా? లేక చంద్రబాబుతో సర్దుకుపోదామనుకుంటున్నారా? [more]

Update: 2019-09-04 03:30 GMT

ఇంతకీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారతారా? లేరా? ఆయన ఢిల్లీ పెద్దలను ఎందుకు కలవలేదు? కలుస్తానంటే ఢిల్లీ పెద్దలే ఆయనను దూరం పెట్టారా? లేక చంద్రబాబుతో సర్దుకుపోదామనుకుంటున్నారా? ఇప్పుడు మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయింది. రాయపాటి సాంబశివరావు తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తుంది.

బీజేపీలో చేరాతరంటూ…..

రాయపాటి సాంబశివరాం బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే వెంటనే ఆయన దానిని ఖండించకుండా కొంత సమర్థించుకున్నారు. తాను బీజేపీ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు కూడా. త్వరలోనే ఢిల్లీ పెద్దలను కలసి తాను ఎప్పుడు చేరేదీ తెలుపుతానన్నారు. తర్వాత రాయపాటి చంద్రబాబునాయుడును కలసి తాను పార్టీని వీడుతున్న విషయాన్ని చెప్పారు. తనకున్న ఇబ్బందులు కూడా చంద్రబాబు ముందు చెప్పారు.

నెల రోజులు గడుస్తున్నా….

అయితే రాయపాటి సాంబశివరావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఆయన పార్టీ మారకపోవడం వెనక బలమైన కారణముందంటున్నారు. ఒకటి తనకు ఇప్పటికే వయసు మీరడంతో ఇకపై ప్రత్యక్ష్య రాజకీయాల్లో పోటీ చేయడం కష్టమని రాయపాటి గ్రహించారు. కుమారుడు రాయపాటి రంగారావు భవిష్యత్ ముఖ్యం కావడంతో పార్టీ మారే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసీపీ లో చేరి కుమారుడు రాజకీయ భవిష్యత్ కు బాట వేయాలని ఒక దశలోఆలోచించారు.

రెండు పార్టీల్లోనూ….

కానీ వైసీపీలో రాయపాటి కుటుంబానికి అవకాశాలు లేవు. ఇప్పటికే గుంటూరు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలన్నీపుల్లుగా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు రాయపాటి రంగారావుకు సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు బీజేపీలోకి వెళ్లినా అక్కడ తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఉండటంతో వేస్ట్ అని నిర్ణయించుకున్నారు. కన్నా తన రాకను అభ్యంతరాలు తెలుపుతూ అధిష్టానం ఎదుట అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఢిల్లీ పెద్దలు కూడా సెలెంట్ అయ్యారు. అందుకే రాయపాటి ప్రస్తుతానికి పార్టీ మారరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News