Rayapati : రాయపాటి లాంటి వాళ్లు పార్టీలో ఇంకెంతమందో?

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది పాత సామెత. ఈ సామెత ఇప్పుడు అక్షరాలా విపక్ష తెలుగుదేశం పార్టీకి అచ్చుగుద్దదినట్లు సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత [more]

Update: 2021-10-07 14:30 GMT

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది పాత సామెత. ఈ సామెత ఇప్పుడు అక్షరాలా విపక్ష తెలుగుదేశం పార్టీకి అచ్చుగుద్దదినట్లు సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసలే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోరన్న పేరు బాగా ఉంది. ప్రతి నిర్ణయాన్ని నానుస్తూ దానిని డైల్యూట్ చేస్తుంటారని రాజకీయ వర్గాల్లో ఆయనకు ట్యాగ్ లైన్ ను కూడా తగిలించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతల బ్లాక్ మెయిలింగ్ కు తట్టుకోగలరా? అన్నదే ప్రశ్న.

అసంతృప్తులు అనేకం…

తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ నేతల అసంతృప్తి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఇప్పటికే రాయపాటి సాంబశివరావు లాంటి నేతలు చంద్రబాబుకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వచ్చారు. నరసరావుపేట పార్లమెంటుకు తన కుమార్తె, సత్తెనపల్లి సీటును తన కుమారుడు రంగారావుకు ఇవ్వాలన్నది రాయపాటి సాంబశివరావు అల్టిమేటం. అయితే రాయపాటికి ఇది కొత్తేమీ కాదు. తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తారు.

ఇప్పటికే కొందరు…

ఇక రాయపాటి సాంబశివరావు తరహాలోనే చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మరింత మంది నేతలు పరోక్ష హెచ్చరికలు పంపే అవకాశముందంటున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు కూడా రెండు స్థానాలను కోరే అవకాశముంది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు తన కుటుంబ సభ్యులకు తునితో పాటు కాకినాడ రూరల్ ఇవ్వాలని కోరుతున్నారట. ఇక రాజమండ్రిలోనూ ఆదిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు ఎంపీటిక్కెట్ ను కూడా కోరే అవకాశముంది.

ఒక్కొక్క కుటుంబానికి…

రాయలసీమలోనూ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, నిమ్మల కిష్టప్ప, కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ, భూమా కుటుంబాలు కూడా ఒక్క టిక్కెట్ తో సరిపెట్టుకునే పరిస్థిితి లేదు. వీరి కుటుంబానికి రెండు టిక్కెట్లు కేటాయించకపోతే వెంటనే రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. రాయపాటి సాంబశివరావు భోళా మనిషి కాబట్టి బయటపడ్డారు. కానీ కొందరు ఇప్పటికే సంకేతాలు పంపగా, మరికొందరు ఎన్నికల సమయంలో బాబు ముందు తమ ప్రతిపాదనలు ఉంచనున్నారు. మొత్తం మీద రాయపాటి ఇచ్చిన అల్టిమేటంలు అనేకం చంద్రబాబుకు చేరే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News