లాలూ ఆగయా… ఆర్జేడీ బచ్ గయా

బీహార్ ఎన్నికలకు మంచి ఊపు వచ్చింది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ కు ఆక్సిజన్ వచ్చినట్లయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించడంతో ఆర్జేడీ [more]

Update: 2020-10-15 17:30 GMT

బీహార్ ఎన్నికలకు మంచి ఊపు వచ్చింది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ కు ఆక్సిజన్ వచ్చినట్లయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించడంతో ఆర్జేడీ సగం విజయం సాధించినట్లే ఫీలవుతుంది. ఒక రకంగా ఇది నిజమే. లాలూ లేని ఎన్నికలను బీహార్ లో ఊహించుకోలేం. 2015 ఎన్నికల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ మహాకూటమిని దగ్గరుడి గెలిపించారు. ఎన్నికల్లో ఆయన వ్యూహాలు, అభ్యర్థుల ఎన్నిక ప్రత్యర్థులను సయితం పోలింగ్ కు ముందే చిత్తు చేస్తాయంటారు.

కొన్నేళ్లుగా జైల్లోనే….

అయితే లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్నేళ్లుగా పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ బయట ఉండరన్న బాధ ఆర్జేడీకి చెందిన ప్రతి కార్యకర్తలో ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ రావాలని కార్యకర్తలు చేయని పూజలేదు. మొక్కని దేవుడు లేడు. అలాంటి పరిస్థితుల్లో లాలూ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఒక కేసులోనే బెయిల్ లభించింది. మరొక కేసులో రావాల్సి ఉంది.

ప్రచారంతోనే……

లాలూ యాదవ్ ఎన్నికల ప్రచారం అంటేనే అందరికీ ఆసక్తి. ప్రత్యర్థులపై ఆయన చేసే విమర్శలు, వాగ్బాణాలను ప్రజలు ఆసక్తిగా వింటారు. అయితే కొన్నేళ్లుగా జైలులో ఉండటంతో పార్టీని కూడా ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చూసుకుంటున్నారు. తేజస్వి యాదవ్ పై నమ్మకం లేక అనేక పార్టీలు మహాకూటమిని వీడిపోయాయి. తేజస్వి నేతృత్వంలో తాము పనిచేయమని నిర్మొహమాటంగా చెప్పేశాయి.

ఎన్డీఏకు షాక్…..

ఇలాంటి పరిస్థితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించడం మహాకూటమికి పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎన్నికల సమయంలో పెద్దాయనకు ఒక కేసులో బెయిల్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆర్జేడీ నేతలు బాణాసంచా కాల్చి పండగలా చేసుకున్నారు. కానీ మరో కేసులో బెయిల్ రాకపోవడంతో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ఎన్నికలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. క్యాడర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. లాలూ లేని ఎన్నికలను ఊహించుకోలేమంటోంది ఆర్జేడీ క్యాడర్. అయితే లాలూ జైలులో ఉన్నా ఆయన ఆశీస్సులతో ఆర్జేడీ విజయం సాధిస్తుందని నేతలు సయితం నమ్ముతున్నారు.

Tags:    

Similar News