నగరి వైసీపీలో కొత్త రాజకీయం.. ఈ ట్విస్టులు మామూలుగా లేవే ?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విషయం మరోసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆర్కే రోజా.. వచ్చే [more]
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విషయం మరోసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆర్కే రోజా.. వచ్చే [more]
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విషయం మరోసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆర్కే రోజా.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి.. హ్యాట్రిక్ దక్కించు కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విపక్ష నేతలతో పాటు స్వపక్షంలో ఉన్న వ్యతిరేకులను కూడా ఎదుర్కొని మరీ పోరాటం చేస్తున్నారు. అయితే.. ఆర్కే రోజా సహజ ధోరణిని ఇష్టపడని కొందరు నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రోజాను వేరే నియోజకవర్గానికి పంపిస్తారని.. ఆమెకు-నగరికి బంధం తెగిపోతుందని.. పెద్ద ఎత్తున తెరచాటున కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు.
కొన్నాళ్లుగా ప్రచారం…
దీనిపై కొన్నాళ్లుగా నగరిలో చర్చ సాగుతోంది. బహుశ ఇది తెలిసిందో ఏమో.. ఆర్కే రోజా ఇటీవల కాలంలో పనిలే క పోయినా.. ఏదో ఒక పనికల్పించుకుని నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. ప్రజలకు అప్పటికే సీఎం జగన్ ఇచ్చిన పథకాలను తిరిగి తన చేతుల మీదుగా అందించడం.. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి రేషన్ ఇచ్చారా ? పింఛన్ ఇస్తున్నారా ? వంటి విషయాలను ఆరాతీయడం వంటివి ఆర్కే రోజా చేస్తున్నారు. అయితే.. దీని వెనుక .. ఆమె.. వచ్చే ఎన్నికల్లోనూ తానే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే విషయాన్ని పరో క్షంగా ప్రజలకు అందించడంతో పాటు తనను నగరి నుంచి ఎవ్వరూ దూరం చేయలేరన్న విషయాన్ని పరోక్షంగా తన సొంత పార్టీలో తన ప్రత్యర్థులకు చెపుతోన్నట్టుగా ఉంది.
అభిమానులే చేస్తున్నారంటూ…
ఇదే సమయంలో.. తన వర్గం వారితో నగరిలో.. కేజే కుమార్ బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేయడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. తనకు ఎందుకు టికెట్ ఇస్తారో… ఇతర వర్గాలకు ఎందుకు ఇవ్వరో స్పష్టంగా పేర్కొంటూ కరపత్రాలను ఆర్కే రోజా అభిమానుల పేరిట పంచుతున్నారు. అయితే.. ఇదంతా తనకు తెలియదని.. తన అభిమానులే ఇలా చేస్తున్నారని.. కాబట్టి.. ఈ ప్రచారానికి తనకు సంబంధం లేదని.. రోజా చెబుతున్నారు. కానీ, వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ బెంగ పట్టుకుందని.. అందుకే ఆర్కే రోజా ఇలా చేస్తున్నారని.. కేజే వర్గం.. ఆరోపణలు చేస్తోంది. మొత్తంగా చూస్తే.. నగరి నియోజకవర్గంలో రాజకీయాల వేడి చల్లారకపోవడం గమనార్హం.