రోజాకు అదే రాజకీయంగా ఇబ్బంది పెడుతుందా?

ఔను! ఇప్పుడు ఇదే చ‌ర్చ.. ఫైర్‌బ్రాండ్ అనుకూల వ‌ర్గంలో పెద్ద ఎత్తున సాగుతోంది. వైసీపీ నాయ‌కురాలిగా.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్కే [more]

Update: 2021-05-16 14:30 GMT

ఔను! ఇప్పుడు ఇదే చ‌ర్చ.. ఫైర్‌బ్రాండ్ అనుకూల వ‌ర్గంలో పెద్ద ఎత్తున సాగుతోంది. వైసీపీ నాయ‌కురాలిగా.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. రాజ‌కీయ ఫైర్ బ్రాండ్‌గా మ‌రింత జోరు కొన‌సాగిస్తున్నారు. ఆమె మీడియా మీటింగుల‌కు, కామెంట్లకు ఫాలోయింగ్‌లు, లైకులు.. ఎక్కువ‌. రోజా మాట‌ల తూటాలు ఎలా పేల‌తాయో తెలుగు జ‌నానికి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. రాజ‌కీయంగా దూసుకుపోతోన్న ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూనే ఉన్నారు. దీనికితోడు.. వైసీపీ త‌ర‌ఫున గ‌ట్టివాయిస్ వినిపించ‌డంతోపాటు.. సీఎం జ‌గ‌న్‌పై ఈగ వాలినా.. వెంట‌నే స్పందించే నాయ‌క‌గ‌ణంలో ఆర్కే రోజా కీల‌కంగా ఉన్నారు. ఈ క్రమంలోనే గ‌తంలో పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీలో వాయిస్ గ‌ట్టిగా వినిపించారు.

సత్తా చాటుతున్న…..

పార్టీ త‌ర‌ఫున అవ‌స‌ర‌మైతే.. ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాన‌ని ఆర్కే రోజా శ‌ప‌థాలు కూడా చేశారు. ఈ ఇమేజ్‌.. ఈ దూకుడే.. ఆమెకు గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మంత్రి ప‌దవిని క‌ట్టబెడుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు.. ఏకంగా హోం శాఖ‌నే ఇస్తార‌ని కూడా ప్రచారం జ‌రిగింది. కానీ, అనూహ్యంగా ఆ అవ‌కాశం చిక్కలేదు. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్రమంలోనే సీఎం జ‌గ‌న్ ఆర్కే రోజాకు ఏపీఐఐసీ చైర్ ప‌ర్సన్ పోస్టు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మరోసారి.. ఆర్కే రోజా విష‌యం పార్టీలో ప్రధానంగా చ‌ర్చకు వ‌స్తోంది. గ‌త నెలలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో న‌గ‌రి ప‌రిధిలో రోజా స‌త్తా చాటారు. త‌న‌కు వ్యతిరేకంగా ప‌నిచేసిన సొంత పార్టీ నేత‌ల‌ను కూడా ఆమె టార్గెట్ చేసుకుని ముందుకు సాగారు.

ఈసారి మాత్రం..?

ఈ క్రమంలోనే ఓ మంత్రిని సైతం ఆర్కే రోజా టార్గెట్ చేసుకుని విమ‌ర్శలు గుప్పించారు. అయినా.. అధిష్టానం నుంచి ఎలాంటి విమ‌ర్శలు, హెచ్చరిక‌లు రాక‌పోగా.. రోజాను జ‌గ‌న్‌.. ప్రోత్సహించార‌ని.. పార్టీ కోసం ప‌నిచేస్తున్నవారిని ప్రోత్సహించాల‌ని సూచించార‌ని అప్పట్లోనే వార్తలు వ‌చ్చాయి. ఈ క్రమంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ఆర్కే రోజాకు ఛాన్స్ చిక్కడం ఖాయ‌మ‌ని అంటున్నారు ఆమె అనుచ‌రులు.

సామాజికవర్గమే…?

అయితే.. సామాజిక వ‌ర్గం షింక్ అవ‌డం లేదు క‌నుక‌.. మంత్రి పీఠం ద‌క్కడం ఇప్పుడు కూడా క‌ష్టమేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. కానీ, ఈ ద‌ఫా జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆర్కే రోజాకు న్యాయం చేస్తార‌ని అనేవారు కూడా క‌నిపిస్తున్నారు. మొత్తానికి రోజా విష‌యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News