రోజా పదవిపై పందేలు… కోట్లలోనేనట?

విధేయతకు జగన్ ఈసారి అవకాశమిస్తే ఖచ్చితంగా ఆర్కే రోజాకు కేబినెట్ లో చోటు దక్కాలి. లేకుంటే విధేయతకే జగన్ విలువ ఇవ్వనట్లవుతుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా [more]

Update: 2021-07-26 13:30 GMT

విధేయతకు జగన్ ఈసారి అవకాశమిస్తే ఖచ్చితంగా ఆర్కే రోజాకు కేబినెట్ లో చోటు దక్కాలి. లేకుంటే విధేయతకే జగన్ విలువ ఇవ్వనట్లవుతుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు ఈసారి మంత్రి పదవి వస్తుందా? రాదా? అన్న దానిపై పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆర్కే రోజాకు ఇప్పటికే ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఉండటంతో ఈసారి కూడా మంత్రిపదవి దక్కదని కొందరు చెబుతుండగా, ఖచ్చితంగా జగన్ కేబినెట్ లో తీసుకుంటారని కొందరు అంటున్నారు.

విధేయత, వాయిస్ ఉన్న నేతగా?

ఆర్కే రోజా మంత్రి పదవి విషయంలో పెద్దయెత్తున బెట్టింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్కే రోజా మాత్రం జగన్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. నిజంగానే రోజా వైసీపీకి విలువైన నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాయిస్ తో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ క్యాడర్ లో జోష్ నింపగలిగారు. అధికార పార్టీతో గొడవ పడి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు.

రోజాను కాదని….

అటువంటి ఆర్కే రోజాను కాదని నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వారికి మంత్రిపదవులను ఇస్తే జగన్ విశ్వనీయత మీద మరక పడే అవకాశముంది. ఆర్కే రోజా ను సామాజికవర్గ పరంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. ఆమె సినీ నటిగా, రాజకీయ నేతగా కులాలు, మతాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అటువంటి సమయంలో రెడ్డి కులం ముద్ర వేసి ఆర్కే రోజాను మంత్రిపదవికి దూరం చేయవద్దన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

కత్తులు దూస్తున్నా ఓపికతో…?

ఇప్పటికే తన నియోజకవర్గంలో ఆర్కే రోజాపై సొంత పార్టీలోని ప్రత్యర్థులే కత్తులు దూస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. అయినా ఆమె తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఓపికగా భరిస్తూ వస్తున్నారు. మంత్రి పదవి రాకపోతే ఆర్కే రోజా బరస్ట్ అవుతారన్నది వాస్తవం. అది పార్టీకే మంచిది కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం రోజా లాంటి విధేయత గల నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో విన్పిస్తుంది. ఆర్కే రోజా మంత్రి పదవిపై పెద్దయెత్తున బెట్టింగ్ లు నడుస్తుండం విశేషం.

.

Tags:    

Similar News