ప్రతిరోజు పండగే మూవీ రివ్యూ
బ్యానర్: జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ నటీనటులు: సాయి తేజ్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్, సుహాస్, విజయ్ కుమార్, ప్రవీణ్, రజిత, [more]
బ్యానర్: జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ నటీనటులు: సాయి తేజ్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్, సుహాస్, విజయ్ కుమార్, ప్రవీణ్, రజిత, [more]
బ్యానర్: జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్
నటీనటులు: సాయి తేజ్, రాశి ఖన్నా, సత్య రాజ్, రావు రమేష్, సుహాస్, విజయ్ కుమార్, ప్రవీణ్, రజిత, భద్రం, హరితేజ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: థమన్
సినిమాటోగ్రఫీ: జయకుమార్ సంపత్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాత: బన్నీ వాష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: మారుతీ
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నిలబడడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మూస కథలు, మాస్ పాత్రలు అంటూ ట్రాక్ తప్పిన సాయి తేజ్ ఇప్పుడు రైట్ ట్రాక్‌లోకే వచ్చాడు. ఫైట్లు, ఫీట్లు, పంచ్ డైలాగులు, పేరున్న డైరెక్టరు తో సినిమా చేస్తే హిట్ కొట్టెయ్యొచ్చు… లాంటివి సక్సెస్ సూత్రాలు కాదని తెలుసుకున్నాడు. అందుకే ఫైనల్ గా హీరోలా కనిపించడం కాకుండా తాను పోషించే పాత్రలా అనిపించాలని రియలైజ్ అయ్యాడు. గత ఏప్రిల్ లో విడుదలైన చిత్రలహరి లో నటుడిగా సాయి తేజ్ ఓ మెట్టు ఎక్కాడనిపిస్తుంది. ఇక తన పేరులోని కొన్ని అక్షరాలు, తన పాత్రల్లో తరచుగా కనిపించే కొన్ని లక్షణాలు వదిలేసుకున్నాడు. అందుకే సాయి ధరమ్ తేజ్ నుండి సాయితేజ్ గా మారాడు. అంతేకాకుండా డైలాగ్స్ ని హడావిడిగా పలికే ధోరణి కూడా తగ్గించాడు. దానితోపాటుగా ఎక్స్‌ప్రెషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. చిత్రలహరి నుండి అంతో ఇంతో మారిన సాయి తేజ్, మారుతి తో ఫ్యామిలీస్ మెచ్చే చిత్రంగా ప్రతిరోజు పండగే సినిమా చేసాడు. ఈ సినిమా మొత్తం పెద్దవాళ్ళని వదిలేసి.. డబ్బు డబ్బు అంటూ విదేశాలకు ఎగిరిపోయే పిల్లలు… తల్లితండ్రులను వదిలేసి విదేశాల్లోనే సెటిల్ అవుతామంటున్న నేటి తరానికి దగ్గరగా ఉన్న కథ. ఇలాంటి కథే మనం గతంలో శతమానం భవతి సినిమాలో చూసాం. కాకపోతే దర్శకుడు మారుతీ తనదైన కామెడీ టచ్ ఇచ్చి ఈ ప్రతిరోజూ పండగే సినిమాని తెరకెక్కించాడు. మరి మంచి కుటుంబ కథ చిత్రంగా కనబడుతున్న ప్రతిరోజూ పండగే ఫామిలీస్ ని ఏ మేర మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ప్రతిరోజూ పండగే సినిమా కథ ఏమిటనేది..దర్శకుడు మారుతీ ఆ సిఎంమా ట్రైలర్ లోనే చూపించేసాడు. రఘురామయ్య (సత్యరాజ్) లంగ్(ఊపిరితిత్తుల)క్యాన్సర్ తో బాధపడతాడు. అయితే రఘురామయ్య పిల్లలంతా విదేశాల్లో స్థిరపడిపోతారు. పల్లెటూరి లో ఒంటరిగా ఉంటున్న రఘురామయ్య ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్(సాయి ధరమ్ తేజ్) ఇండియాకి బయలదేరుతాడు. రాజమండ్రికి వచ్చిన తర్వాత నుంచే తన కుటుంబాన్ని కూడా ఇండియా కి రప్పించి తాత చివరి రోజుల్ని హ్యాపీగా గడపాలనే వారినంతా ఇండియాకి రప్పిస్తాడు. అయితే రఘురామయ్య ఫ్యామిలీ వచ్చాక అయన తన చిఎవరి రోజులను ఆనందంగా గడిపాడా? అసలు సాయి తేజ్ వాళ్ళని ఇండియా రప్పించడానికి ఎలా ప్లాన్ చేస్తాడు.? ఇండియా వచ్చిన తర్వాత రఘురామయ్య కుటుంబంలో జరిగిన పరిణామాలేమిటి? అయితే ఈ నేపథ్యంలో వచ్చిన సమస్యలను సాయి తేజ్ ఎలా హ్యాండిల్ చేసాడు? అనేది మిగతా కథ.
నటీనటుల నటన:
సాయి తేజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సాయి తేజ్ మరియు రాశీ ఖన్నాల జోడి.. మధ్య కెమిస్ట్రీ మరోసారి చక్కగా కుదిరింది. సుప్రీం తర్వాత వీరిద్దరి మధ్య మిస్సయిన కామెడీ ట్రాక్స్ కానీ టైమింగ్ కానీ ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు. ప్రీ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ తో అయితే అదరగొట్టేసాడు. అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్ తో సహా ఇతర కీలకమైన ఎమోషన్స్ ను పండించడంలో సాయి తేజ్ ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ తాత పాత్రకు ప్రాణం పోశాడు. సత్య రాజ్ మంచి ఎనర్జిటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా అద్భుతమైన నటన కనబర్చారు. ఏంజిల్ ఆర్నాగా రాశి కన్నా బాగా చేసింది. సాయి తేజ్ తో రొమాంటిక్ గా, టిక్ టాక్ గర్ల్ గా గ్లామరస్ గా ఆకట్టుకుంది. రాశి పాత్రకు తగ్గట్లుగా కనిపించి మెప్పించింది. సెకండ్ హాఫ్ లో రావు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. రావు రమేష్ లోని ఎమోషన్స్ కంటే కామెడీ సెన్స్ ను ఈ సినిమాతో ఆస్వాదించవచ్చు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
విశ్లేషణ:
చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ అని ఆత్రేయ గారే చెప్పారు. మరి దర్శకుడు మారుతి కూడా ప్రతిరోజూ పండగే సినిమాతో ఇదే చెప్పాలనుకున్నాడు. మొదట్లో ఈ సినిమాపై శతమానం భవతి ఛాయలు కనిపించినా రెండు విభిన్నమైన కథలే. ప్రతి రోజు పండగే ఎవరికీ తెలియని కథ కాదు.. ఎన్నోసార్లు మనం చూసిన, విన్న కథ. అయితే అందరికి తెలిసిన కథను మనసుకు నచ్చేలా.. కాస్త నిష్టూరంగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు మారుతి. ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా నిజానికి ఈ సినిమాలో చూపించాడు మారుతి. పిల్లల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళను చేసి.. చివరి రోజుల్లో వాళ్ళ తోడు లేక ఒంటరి జీవితం అనుభవించే తల్లిదండ్రుల కథ ఇది. చాలా సింపుల్ స్టోరీ ని కామెడీ టచ్ ఇస్తూ.. ఎమోషనల్ గా నడిపించాడు మారుతి. సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకుడు మారుతి ఎప్పటి లానే ఎంటర్టైన్మెంట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ కామెడీ ట్రాక్స్ నవ్వించేలా బాగానే ఉంటాయి. చూసినప్పుడు కొన్ని ట్రాక్స్ అయితే మంచి హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిసార్లు ట్రాక్ తప్పినట్లుగా మిస్ ఫైర్ అయ్యాయి అంతే. ఫస్టాఫ్ చాలా వరకు పూర్తిగా కామెడీతో నింపేసాడు. ఎమోషనల్ గా కథ మొదలుపెట్టినా.. రావు రమేష్, రాశిఖన్నా లాంటి క్యారెక్టర్లతో కావాల్సినంత కామెడీ చేయించాడు మారుతి. ఫస్ట్ హాఫ్ లో ఎంత టైంపాస్ చేయించినా.. సెకండ్ హాఫ్ లో కథంటూ లేకుండా సినిమాను నడిపిస్తే ప్రేక్షకుడికి విసుగు పుడుతుంది. అసలేమాత్రం మలుపుల్లేకపోవడం నిరాశ పరుస్తుంది. సెకండాఫ్ మరింత ఎమోషనల్ గా సాగింది. అక్కడక్కడ ఎమోషన్ మిస్ఫైర్ కూడా అయింది. ఎమోషన్ లో అతి అనిపించింది మాత్రం మాటిమాటికీ బ్రతికున్న మనిషికి చచ్చిపో అని చెప్పడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మారుతి కామెడీ కూడా రొటీన్ గా ఉందనిపిస్తుంది. అయితే మారుతి ఫైనల్ గా ఇక్కడ పిల్లలు విలన్లు కాదు.. పరిస్థితులే ప్రతినాయకులు అంతే.. అంటూ సినిమాలో అదే చూపించే ప్రయత్నం చేశాడు.
సాంకేతికంగా…
ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతిరోజూ పండగే సినిమాకి రెండు పాటలకి హైలెట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ పాటల చిత్రకరణ కూడా బావుండడంతో.. సినిమాలో ఆ రెండు పాటలు స్పెషల్ అనిపిస్తాయి. ఇక థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి చించేసాడు. డీసెంట్ బ్యాక్గ్రౌండ్ తో అదరగొట్టేసాడు. జయకుమార్ సంపత్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా పాటల్లో కెమెరా పనితనం మరింత బాగా కనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ స్థాయికి తగ్గట్లుగా సినిమాకి బడ్జెట్ పెట్టారు.
ప్లస్ పాయింట్స్: మ్యూజిక్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కామెడీ, రావు రమేష్ పాత్ర, ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: తెలిసిన కథ, ఎమోషన్స్ బలంగా లేకపోవడం
రేటింగ్: 2.75/5