రివ్యూ 2: సైరా (సైరా నరసింహారెడ్డి)
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ అమితాబచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ, పృథ్వి తదితరులు డైలాగ్స్: [more]
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ అమితాబచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ, పృథ్వి తదితరులు డైలాగ్స్: [more]
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ అమితాబచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ, పృథ్వి తదితరులు
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
రచన: పరుచూరి బ్రదర్స్
ఫైట్స్: జార్జ్ పావెల్ – రామ్ లక్ష్మణ్ – లీ విట్టాకర్
ఎడిటింగ్: ఏ.శ్రీకర ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
మ్యూజిక్: అమిత్ త్రివేది
నిర్మాత్: రామ్‌చరణ్ కొణిదెల
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
రిలీజ్ డేట్: 02 అక్టోబర్, 2019
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 170.50 నిమిషాలు
తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవిది నాలుగు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానం. ఎప్పుడో పున్నమినాగు సినిమా నుంచి ప్రారంభమైన చిరు సినిమా ప్రస్థానంలో అన్నీ జయాలే. ఈ వయస్సులో కూడా ఎన్నో సంచలనాలతో చిరు దూసుకుపోతున్నాడు. పదేళ్లు గ్యాప్ వచ్చినా వెండితెరపై తాను మహరాజునే అని ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిరు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా సినిమాలో చిరు ప్రముఖ తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అయిన కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు. కొన్ని దశాబ్దాల క్రితం మన తెలుగు గడ్డమీద జరిగిన ఓ పోరాట వీరుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. రూ.280 కోట్ల భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ కొన్నేళ్లుగా ఈ కథపై చేసిన రీసెర్చ్‌ను సురేందర్ వాడుకుంటూ ఈ తరం జనరేషన్‌ను మెప్పించేలా సినిమా చేశానని చెప్పారు. ఇక వరల్డ్ వైడ్‌గా గాంధీజయంతి కానుకగా ఐదు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆకాశాన్ని టచ్ చేసే అంచనాలతో వచ్చిన సైరా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల మనస్సులను ఎలా టచ్ చేసిందో తెలుగుపోస్ట్.కామ్ సమీక్షలో చూద్దాం.
స్టోరీ …
18వ శతాబ్దం మధ్యలో కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ప్రజలను పాలిస్తూ ఉంటారు. నాటి నిజాం ప్రభువు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వళ్లకు దత్తత ఇవ్వడంతో వీటిని దత్త మండలాలు అని పిలుస్తుంటారు. వీటిని ఏలే పాలెగాళ్ల నుంచి బ్రిటీష్ వాళ్లు ముక్కు పిండి మరీ శిస్తు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరిని ఏకం చేసేందుకు ఉయ్యాలవాడ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (చిరంజీవి) యజ్ఞం జరిపిస్తాడు. బ్రిటీషర్లు అంటే భయపడే కొందరు పాలెగాళ్లు నరసింహా రెడ్డికి సహకరించరు. ఈ క్రమంలోనే పంట పండకపోయినా శిస్తు కట్టాలని బ్రిటిషర్లు హుకుం జారీ చేస్తారు. కోవెలకుంట్ల బ్రిటీష్ రేంజర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అంతమొందించే క్రమంలో.. నరసింహారెడ్డే అతడిని చంపేస్తాడు. అప్పటి నుంచి బ్రిటీష్ వారు నరసింహారెడ్డిని అంతమొందించేందుకు అనేక కుట్రలు ప్లాన్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ కుట్రలను నరసింహారెడ్డి ఎలా ? ఎదుర్కొన్నాడు ? చివరకు తాను భారతదేశ తొలి స్వాతంత్య్ర కాంక్ష రగిల్చిన ఈ వీరుడు జీవితం ఎలా ముగిసింది ? సైరా జర్నీలో సిద్ధమ్మ (నయనతార), వీరవెంకట మహాలక్ష్మి (తమన్నా), రాజనండి (విజయ్ సేతుపతి) పాత్రలు ఎలా తోడయ్యాయి ? అన్నదే సైరా సినిమా.
సైరా ఎనలైజింగ్…
సైరా నరసింహారెడ్డి కథనాన్ని సురేందర్ రెడ్డి నరసింహారెడ్డి బాల్యం నుంచి ప్రారంభించాడు. బ్రిటీషర్లు భారత దేశాన్ని దోచుకుంటున్న క్రమంలో చిన్నప్పుడే నరసింహారెడ్డిలో స్వాతంత్ర కాంక్ష రగులుతుంది. తొలి 30 నిమిషాల పాటు ప్రధాన కథనంలోకి కథ వెళ్లదు. రేనేటి గడ్డ, పాలెగాళ్ల పరిచయం చేయడంతోనే కథ నడుస్తుంది. ఇక కథలోకి వెళ్లాక బ్రిటీష్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం ఇంటర్వెల్ బ్యాంగ్‌తో నరసింహారెడ్డి సత్తా ఏంటో బ్రిటీషర్లకు తెలియడంతో కథలో స్పీడ్ పెరుగుతుంది.దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఇటువంటి సబ్జెక్టును సురేందర్ ఇప్పటి వరకు ముట్టుకోకపోయినా ఈ సినిమాలో కీలక నటులు, ఇతర భాషా నటులను మేనేజ్ చేస్తూ సీన్లు తెరకెక్కించే విధానం వరకు మాత్రం బాగానే ఉంది. కొన్ని చోట్ల అవసరానికి మించి యాక్షన్ దట్టించేశారు. మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారనే సురేందర్ ఇలా యాక్షన్ ఇరికించినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
సెకండాఫ్ లో…..
ఇక కీలకమైన సెకండాఫ్ విషయానికి వస్తే నరసింహారెడ్డి తనతో పాటు మరికొంత మంది పాలేగాళ్లను కూడబెట్టుకుని బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డికి సాయం చేసే పాలగాళ్లు ఎవరనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. చివరకు కొన్ని ఉత్కంఠ భరిత సీన్లతో పాటు కొన్ని ఎమోషన్ సీన్ల మధ్యలో నరసింహారెడ్డి బ్రిటీషర్ల చేతికి చిక్కుతాడు. ఇక్కడ సినిమాను ఎమోషనల్‌గా ప్రేక్షకుడు పూర్తిగా లీనమయ్యేలా తెరకెక్కించే మంచి ఛాన్స్ దర్శకుడు వదులుకున్నాడు.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ …
ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి అద్భుతంగా నటించాడు. అటు యాక్షన్ సీన్లతో పాటు ఇటు డైలాగ్స్‌తో ఎక్కడ తడబాటు లేకుండా చిరు నటన అమేజింగ్‌గా ఉంది. సీరియస్ సీన్లలో చిరు ఎక్ర్‌ప్రెషన్స్ అద్భుతం. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నరసింహారెడ్డి గురువు పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మెగాస్టార్ భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార కొన్ని సీన్లకు పరిమితం అయ్యింది. చూడడానికి నయనతార లుక్ బాగున్నా ఆమెను మరికొన్ని బలమైన సీన్లలో వాడుకుని ఉండాల్సింది అనిపించింది. ఇక సైరా నరసింహారెడ్డి ప్రియురాలుగా వీర వెంకట మహాలక్ష్మి పాత్రలో తమన్నా తళుక్కు మంది. సైరా కోసం ఆమె చేసిన త్యాగం మెప్పించింది.
సుదీప్ పాత్ర హైలెట్……
సామంత రాజులుగా నటించిన కిచ్చ సుదీప్ సైరా అంటే తీవ్రమైన వైరుధ్యం ఉన్న వ్యక్తిగా మెప్పించాడు. సామంత రాజు పాత్రలో జగపతిబాబు కంటే సుదీప్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఇక సామంత రాజులుగా నటించిన జగపతిబాబు పాత్రకు అంత స్కోప్ లేదు. విచిత్రం ఏంటంటే తెలుగులో సీనియర్ నటుడుగా ఉన్న జగపతిబాబు పాత్ర కంటే ఉత్తరాది నటుడు రవి కిషన్ సింగ్, కన్నడ నటుడు సుదీప్ పాత్రకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చినట్లనిపించింది. బ్రిటీష్ వారిపై నరసింహా రెడ్డి పోరాటం గురించి తెలుసుకొని తమిళనాడు నుంచి వచ్చి ఉద్యమంలో పాల్గొనే రాజనంబిగా విజయ్ సేతుపతి తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. ఇక బ్రిటీషర్లుగా నటించిన విదేశీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 30 ఇయర్స్ పృథ్వి, రఘుబాబు జస్ట్ ఓకే.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్…
టెక్నికల్‌గా ముందు ఈ భారీ విజువల్ ఫీస్ట్‌ను కళ్లకు కట్టినట్టు చూపించేలా సక్సెస్ అయినందుకు సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎన్నో సంక్లిష్టమైన షార్ట్స్‌ను సైతం తన ప్రేముల్లో అందంగా బంధించాడు. ఇక కమల్ కణ్ణన్ వీఎఫ్ఎక్స్ చాలా చోట్ల తేలిపోయినట్లు అనిపించింది. జాతర జరిగే టైంలో ఎద్దుల దాడి నుంచి ప్రజలను కాపాడే సీన్‌లో వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. ఇక అమితాబ్ ఆశ్రమంలో వేసిన సెట్లో కూడా వీఎఫ్ఎక్స్‌లో క్వాలిటీ లేదు. అమిత్ త్రివేది మ్యూజిక్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా సీన్లకు తగినట్టుగా ఉంది. రామ్,లక్ష్మణ్, పావెల్, విట్టాకర్ త్రయం కంపోజ్ చేసిన ఫైట్లు సినిమాలో కథను డామినేట్ చేసేశాయి. అసలు కథ కంటే యాక్షన్ సన్నివేశాల మీద కాన్‌సంట్రేషన్ చేయడంతో ఇది ఓ విధంగా మైనస్సే అయ్యింది. పరుచూరి బ్రదర్స్ కథ కోసం చాలా వర్క్ చేసినట్టే కనిపించింది. అలాగే సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ కి అయితే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కొన్ని చోట్ల ట్రిమ్ చేసేలా ఉన్నా దర్శకుడు కథనం ప్లాట్‌గాను, స్లోగా ఉండడంతో ఇక్కడ ఎడిటర్‌ను తప్పు పట్టలేని పరిస్థితి.
సురేందర్‌రెడ్డి డైరెక్షన్ టేకింగ్….
సైరా నరసింహరెడ్డి లాంటి ఒక చారిత్రాత్మిక కథాంశాన్ని తెరకెక్కించే విషయంలో సురేందర్ రెడ్డి పూర్తిగా గాడి తప్పాడు. చరిత్రను సినిమాటిక్‌గా మార్చే క్రమంలో ఒక కమర్షియల్ చట్రంలో ఇరికించేసిన సురేందర్ రెడ్డి చాలా వరకు స్వేచ్ఛ తీసుకుని ఇష్టానుసారం కథనాన్ని అష్టవంకర్లు తిప్పేశాడు. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాల మీద దృష్టి పెట్టిన సురేందర్ రెడ్డి ఎమోషన్‌ల్ సీన్లలో సైతం అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ సైరాను చంపేందుకు గంట ముందే కన్నుమూస్తే సినిమాలో అలా జరగలేదు. ఈ చారిత్రక సినిమాను తెరకెక్కించేందుకు ప్రతి సీన్‌లోనూ అతడు పడిన కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. సినిమాను ఇంకా బాగా తీసే ఛాన్స్ ఉన్నా ఆ రేంజ్‌లో సక్సెస్ కాలేదనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ (+) :
– మెగాస్టార్ చిరంజీవి అమేజింగ్ పెర్ఫామెన్స్
– రత్నవేలు సినిమాటోగ్రఫీ
– నేపథ్య సంగీతం
– ఆర్ట్ వర్క్, సెట్టింగులు
– ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర..
మైనస్ పాయింట్స్ (-) :
– ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్
– తెలిసిన చరిత్రే వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపించడం
– కమర్షియాల్టీ కోసం చరిత్రను చాలా చోట్ల వక్రీకరించడం
ఫైనల్‌గా…
ఓవరాల్‌గా సైరా నరసింహారెడ్డి చిత్రం ఓ దేశభక్తి సినిమాగా… మన తెలుగు జాతి గర్వించదగ్గ తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రగా చూసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కమర్షియల్ హంగులను పక్కనబెట్టి ఓ దేశభక్తి సినిమాగా సైరా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విజయం సాధించింది.
రేటింగ్: 2.75 / 5