ఈయన కూడా సై అంటున్నారట

తమిళనాడు ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అంటేనే సినీ ప్రముఖులు రాజకీయ నేతలుగా మారి పార్టీలు పెట్టిన విజయం సాధించిన సందర్భాలు అనేకం [more]

Update: 2021-02-07 16:30 GMT

తమిళనాడు ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అంటేనే సినీ ప్రముఖులు రాజకీయ నేతలుగా మారి పార్టీలు పెట్టిన విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంజీఆర్ సీనీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీని జయలలిత సినీ రంగం నుంచి వచ్చి విజయవంతంగా నడపగలిగారు. ఇక కరుణానిధి సయితం సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఇప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా సినీ హీరోనే.

అనేక మంది సీనీ రంగం నుంచి…..

ఇలా సినీ రంగానికి, తమిళనాడు రాజకీయాలకు ముడిపడి ఉంది. ఇక కెప్టెన్ విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ పెట్టి మంచి ఫలితాలనే సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన తన బలమేంటో చూపాలని సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో ఉంది. అయితే ఆ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు విజయ్ కాంత్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.

శరత్ కుమార్ సయితం….

ఇక కమల్ హాసన్ సయితం మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి జనంలోకి వెళ్లారు. కానీ ఆయన పార్టీకి జనం మద్దతుగా నిలవలేదు. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటుతానని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, పార్టీ పెడతానని చెప్పి ఆరోగ్య కారణాల రీత్యా వెనక్కు తగ్గారు. అయితే తాజాగా శరత్ కుమార్ సయితం ఈ ఎన్నికల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు.

సొంత పార్టీ పెట్టినా…..

శరత్ కుమార్ 1996లో డీఎంకేలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యారు. అయితే కరుణానిధి కుటుంబంతో విభేదాలు తలెత్తడంతో ఏఐఏడీఎంకేలో చేరారు. అయితే 2006లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన 2007లో సమత్తువ మక్కల్‌ కట్చి పార్టీని ప్రారంభించారు. అప్పట్లో జరిగిన తిరుమంగళం ఉప ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. దీంతో ఆయన కొంత కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో శరత్ కుమార్ పార్టీ కూడా రంగంలో ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News