గరుడ పురాణం శివాజీ రీ ఎంట్రీ.. రీజన్ అదేనా?

జోస్యాలు చెప్పే శివాజీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా నిలిచిన శివాజీ ఫలితాల తర్వాత గాయబ్ అయ్యారు. తెలంగాణలో టీవీ [more]

Update: 2021-03-13 11:00 GMT

జోస్యాలు చెప్పే శివాజీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా నిలిచిన శివాజీ ఫలితాల తర్వాత గాయబ్ అయ్యారు. తెలంగాణలో టీవీ 9 కేసులు చుట్టుకోవడం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో దాదాపు 19 నెలల నుంచి సినీనటుడు శివాజీ అడ్రెస్ లేరు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రైతులకు మద్దతుగా నిలిచి శివాజీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

టీడీపీకి అండగా…..

2014 నుంచి శివాజీ ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. చంద్రబాబుపై విపక్షాలు చేసే విమర్శలకు టీడీపీ నేతల కంటే ముందుగా శివాజీ స్పందించేవారు. డేటాచోరీ కేసులోనూ ఇది బీజేపీ, కేసీఆర్ కుట్రగా అపట్లో శివాజీ విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు డేటా చోరీ చేశారని సిట్ నివేదిక ఇస్తుందని కూడా అప్పట్లో శివాజీ జోస్యం చెప్పారు. ఇక ఎన్నికల వేళ చంద్రబాబును గెలిపిస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని శివాజీ పదే పదే చెప్పారు.

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి…..

తొలుత బీజేపీలో ఉన్న శివాజీ ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా మారారు. ఇక రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై శివాజీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బాబు హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చిందీ? అమరావతి ఎంత అభివృద్ధి అయిందీ కూడా శివాజీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అమరావతిలో నిర్మించిన భవనాలను చూపించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూనే శివాజీ చంద్రబాబును వెనకేసుకు వస్తారు.

మళ్లీ యాక్టివ్ అయి….

ఇక గరుడ పురాణం గురించి శివాజీ చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్ర పన్నిందని, జగన్, వపన్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యులని శివాజీ జోస్యం చెప్పారు. చాలా రోజుల తర్వాత శివాజీ మళ్లీ యాక్టివ్ కావడం ఆసక్తికరంగా మారింది. మళ్లీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వైసీపీలను టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఏం ఆశించి శివాజీ మళ్లీ యాక్టివ్ అయ్యారో. చంద్రబాబుకు ఎవరూ అండగా లేరన్న ఉద్దేశ్యంతో శివాజీ తిరిగి వచ్చారా? లేదా? ప్యాకేజీ అందిందా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News