కోవర్టుల కొమ్ములు వంచాలనేనా?

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాక సోము వీర్రాజు తన టీంతోనే పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీలో టీడీపీని బలహీనం [more]

Update: 2021-05-02 02:00 GMT

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాక సోము వీర్రాజు తన టీంతోనే పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీలో టీడీపీని బలహీనం చేసి రెండోస్థానంలోకి బీజేపీ రావాలన్న లక్ష్యంతో సోము వీర్రాజు పనిచేస్తున్నారు. ఈ లక్ష్యం కోసం తనకు అడ్డువస్తారని భావించిన సొంత పార్టీ నేతలను సోము వీర్రాజు పక్కన పెట్టారు. కొందరిపై పార్టీ వ్యతిరేక ముద్ర వేస్తూ ఓటు వేశారు.

బాధ్యతలను చేపట్టగానే?

సోము వీర్రాజు తొలి నుంచి బీజేపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని అనుమానిస్తూనే ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాక మునుపు కూడా వారెవ్వరితో ఆయన కలిసేవారు కారు. తన పని తాను చూసుకునే వారు. ఎమ్మెల్సీగా పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను మాత్రమే సోము వీర్రాజు చూసుకునే వారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత టీడీపీ కాంటాక్టులను కట్ చేయడానికే సోము వీర్రాజు ప్రాధాన్యత ఇస్తున్నారు.

జగన్ కు లేఖ రాయడంతో…

ఆయన పెద్దగా సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి వారితో కలవడం లేదు. తన టీంతోనే ముందుకు వెళుతున్నారు. అయితే ఇటీవల సోము వీర్రాజు జగన్ కు రాసిన లేఖ సొంత పార్టీలోనే సంచలనంగా మారింది. చంద్రబాబు హయాంలో వైద్య పరికరాల కొనుగోళ్లపై ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరపాలని సోము వీర్రాజు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

కామినేని టార్గెట్….?

అప్పటి చంద్రబాబు మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ ఉండేవారు. ఆయన బీజేపీ నేతే. సుజనా బ్యాచ్. దీంతోనే వైద్య పరికారల కొనుగోళ్లపై విచారణ జరపాలని సోము వీర్రాజు జగన్ కు లేఖ రాసినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అయితే వీర్రాజు లేఖ చంద్రబాబు కంటే సొంత పార్టీ నేత కామినేని శ్రీనివాస్ ను టార్గెట్ గా చేసుకున్నట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే దీనిపై పార్టీ వర్గాలు మాత్రం అభ్యంతరం వ్కక్తం చేస్తున్నాయి. 300 కోట్ల కుంభకోణం విషయంలో నిజాలు వెలుగు చూడాలన్నదే సోము వీర్రాజు లక్ష్యమని, వ్యక్తులు కాదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News