అందుకే ఇటు వైపు చూడటం లేదా?

సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన నాటి నుంచి పార్టీకి ఎలాంటి విజయాలు లభించలేదు. కనీస పనితీరును పార్టీ కనపర్చక లేకపోయింది. ఇక పార్టీలో [more]

Update: 2021-07-03 03:30 GMT

సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన నాటి నుంచి పార్టీకి ఎలాంటి విజయాలు లభించలేదు. కనీస పనితీరును పార్టీ కనపర్చక లేకపోయింది. ఇక పార్టీలో చేరికల విషయానికొస్తే సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీ కండువా కప్పుకున్న వారే లేరంటే అతిశయోక్తి కాదు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పార్టీలో చేరికలతో రోజురోజుకు బలోపేతం అవుతుంటే ఏపీలో మాత్రం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుంది.

అధినాయకత్వం నమ్మకంతో…?

సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన నేత. పార్టి సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి ఉండే నేత. ఆయన సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళుతుందని అందరూ భావించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా సోము వీర్రాజు పై గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా దిగజారిపోయింది. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. తిరుపతి ఉపఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఏపీలో లేనట్లే కనపడింది.

చేరికలు లేక?

మరో వైపు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేరికలతో కొంత జోష్ ఉండేది. కానీ సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టిన తర్వాత చేరికలు అంటూ లేకుండా పోయాయి. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో కపిలతీర్థం టు రామతీర్థం యాత్ర అంటూ హడావిడి చేసి ఆ తర్వాత వదిలేశారు. దీనికి తోడు జనసేనతో తప్ప తమకు ఏపార్టీతో పొత్తు ఉండదని సోము వీర్రాజు పదే పదే చెబుతున్నారు. అంటే టీడీపీని తాము దరిచేర్చుకోమని చెబుతున్నారు.

ఉన్న నేతలు కూడా?

దీంతోనే బీజేపీలో చేరికలకు ఫుల్ స్టాప్ పడిందని చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం నేతలు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని రెడీ అయ్యారు. కానీ సోము వీర్రాజు వైఖరితో వారు కూడా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. మరో మూడేళ్లు కాలం వెళ్లబుచ్చితే టీడీపీ నుంచే పోటీ చేయవచ్చని వారు భావించడమే ఇందుకు కారణం. అలాగే ప్రస్తుతం బీజేపీలో చేరిన నేతలు కూడా త్వరలోనే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలన్నీ భవిష్యత్ లో సోము వీర్రాజుకు తలనొప్పిగా మరనున్నాయి.

Tags:    

Similar News