అది సాధ్యమేనా సుజనా?
రాజకీయాల్లో పార్టీల వల్ల నాయకులకు ప్రయోజనం.. నాయకుల వల్ల పార్టీలకు ప్రయోజనం అనేది పరస్పర సహకారం వంటిదే. అందుకే ఎవరి అవసరం మేరకు వారు పార్టీలు మారడం.. [more]
రాజకీయాల్లో పార్టీల వల్ల నాయకులకు ప్రయోజనం.. నాయకుల వల్ల పార్టీలకు ప్రయోజనం అనేది పరస్పర సహకారం వంటిదే. అందుకే ఎవరి అవసరం మేరకు వారు పార్టీలు మారడం.. [more]
రాజకీయాల్లో పార్టీల వల్ల నాయకులకు ప్రయోజనం.. నాయకుల వల్ల పార్టీలకు ప్రయోజనం అనేది పరస్పర సహకారం వంటిదే. అందుకే ఎవరి అవసరం మేరకు వారు పార్టీలు మారడం.. ఏ అవసరానికి ఆ గొడుగు పట్టడం అనేది ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి టీడీపీలోకి గతంలో జంప్‌లు చేశారు నాయకులు. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ రాజకీయంగా పుంజుకునేందుకు అనేక వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తోంది. ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకునేందుకు రెడ్ కార్పెట్ పరిచి, డోర్లు తెరిచి కూర్చున్నారు కమల నాథులు. అయితే, ఇప్పటి వరకు పెద్దగా ఆశించిన స్థాయిలో చేరకలు జరగలేదు.
టీడీపీ నేతలు వచ్చినా….
ఎప్పటికప్పుడు ఈ చేరికలకు సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. గడువును కూడా పెంచుతున్నారు. ఇక, ఈ మార్పు, చేర్పుల వల్ల.. పార్టీలకు ప్రయోజనం ఉంటుందా? ఉండదా? అనే కాలమే నిర్ణయిస్తుంది. కానీ, తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. అయితే, అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీలోకి వెళ్లేందుకు ఇటీవల కాలంలో టీడీపీ నేతలు చూస్తున్నారు. వారి వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే, వీరిని ఉద్దేశించి సుజనా చౌదరి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఎంత మంది వచ్చినా.. బీజేపీకి ఒనకూరే లబ్ధి ఏమీ ఉండదన్నారు.
వైసీపీ నుంచి వస్తేనే…?
అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీలో చేరితే.. పార్టీ బలపడడంతోపాటు వారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుందని సుజనా చౌదరి అన్నారు. దీనిలో రెండు రకాలుగా సుజనా చౌదరి వ్యూహం కనిపిస్తోంది. ఒకటి టీడీపీని ఎవరూ వీడకుండా చూడాలనే వ్యూహంతోపాటు.. వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాలనే మరో వ్యూహం కూడా కనిపిస్తోంది. కానీ, వాస్తవానికి సుజనా చౌదరి చెప్పిందే నిజమైతే.. టీడీపీ వారి వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం కూడా లేదని భావిస్తే.. ఆయన కూడా నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. కట్టకట్టుకుని ఒక్కసారిగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకిచేరిపోయి.. విలీన ప్రకటన చేయించారు.
మరి నీవల్ల కూడా…..
మరి ఇప్పుడు వీరి వల్ల కూడా బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదని భావించాలా ? సుజనా చౌదరిని చుట్టుముడుతున్న ప్రశ్న ఇదే. లేక .. తన రాజకీయ జన్మకు కారణమైన టీడీపీ నుంచి నాయకులు వలస వస్తే.. పార్టీ బలహీనపడుతుందనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబుపై భక్తితో ఇలా వ్యాఖ్యానించారా? అనేది చర్చకు దారితీస్తోంది. మొదటిదే నిజమైతే.. సుజనా చౌదరి వల్ల కూడా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఆ పార్టీని అడ్డు పెట్టుకుని తాను బ్యాంకుల కేసుల నుంచి ఇతరత్రా ఐటీ దాడులనుంచి రక్షించుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని సుజనా చౌదరి ఒప్పుకొన్నట్టే అవుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో సుజనా చౌదరి ఏమంటారో చూడాలి.