ఈ ఏడాది గండమున్న ఆ అగ్రనేత ఈయనేనా…?

ఉగాది పంచాంగంలో మనుషులు గురించి ఉండదు, రాశుల గురించే అక్కడ చెప్పబడుతుంది. గ్రహ సంచారం ఎలా ఉందో చూచాయగా మాత్రమే అక్కడ తెలుస్తుంది. దాన్ని ఎవరు ఎలాగైనా [more]

Update: 2021-04-14 05:00 GMT

ఉగాది పంచాంగంలో మనుషులు గురించి ఉండదు, రాశుల గురించే అక్కడ చెప్పబడుతుంది. గ్రహ సంచారం ఎలా ఉందో చూచాయగా మాత్రమే అక్కడ తెలుస్తుంది. దాన్ని ఎవరు ఎలాగైనా అన్వయించుకోవచ్చు. ఇక రాజకీయాలకు వాటిని జోడిస్తే మంచి మసాలా వార్తే అవుతుంది. ఇపుడు ఏపీలో అలాంటి వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఒక బాంబు లాంటి వార్తను ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర పేల్చారు.

సంచలనమే …?

ఈ ఏడాది ఒక బడా నాయకుని గ్రహచారం అసలు బాగులేదని స్వామీజీ స్వరూపానందేంద్ర అంటున్నారు. మరి ఆ బడా నాయకుడు ఎవరు అన్నదే ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. స్వామీ స్వరూపానందేంద్ర చెప్పింది ఒక అగ్ర నాయకుడు అని మాత్రమే. ఆయన జాతీయ స్థాయి నేతనా. లేక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడా అన్నది మాత్రం వివరంగా చెప్పలేదు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు దాన్ని అన్వయించుకుంటున్నారు.

జగన్ భేష్…

ఇక స్వామీ స్వరూపానందేంద్ర ఏపీ సీఎం జగన్ జాతకం చూసి ఈ ఏడాది ఆయనకు భేషుగ్గా ఉందని సెలవిచ్చేశారు. జగన్ ఏలుబడిలో రాష్ట్రం కష్టాల సుడిగుండాలను దాటుకుని ముందుకు సాగుతుంది అని కూడా తేల్చేశారు. ఆర్ధికంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా రాష్ట్రం అధిగమిస్తుంది అని కూడా స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణాకు చెందిన సీఎం కేసీయార్ జాతకం కూడా బాగానే ఉంటుంది అని స్వరూపానందేంద్ర స్వామీజీ చెప్పడమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి పధంలో పరుగులు తీస్తాయని కూడా అన్నారు.

ఇక మిగిలిందెవరో…?

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రుల జాతకాలూ బాగానే ఉంటాయని అంటే ఇక గండాలు ఎదుర్కొనే వారి జాబితాలో వారు లేరన్న మాటే. అదే విధంగా చూస్తే ఏపీ వరకూ చూస్తే అందరూ ప్రతిపక్షంలో ఉన్న వారి మీద కూడా చర్చను మళ్ళిస్తున్నారు. దేశంలో పెద్ద నాయకులు అయితే చాలా మంది ఉన్నారు, కానీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఏపీకి చెందిన వారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల గురించే తన పంచాంగంలో అంతా ఎక్కువగా వివరించారు. ఆ లెక్కన గండం ఉన్న నేత కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అయి ఉంటారనే అంటున్నారు. ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు రాజకీయంగా ఇబ్బందులే పడుతున్నాయి. మరి వాటికి మించి ఇబ్బందులు ఏ నాయకుడిని వస్తాయి అన్నది ఆలోచించాల్సిన విషయమే.

Tags:    

Similar News