రాజ్యాంగ పదవులు…రాజకీయాలు

రాజ్యాంగ పదవులు ఉన్నవారు రాజకీయం చేయకూడదని నియమాలు ఎక్కడా లేవు. అయితే వారు అన్ని వర్గాలకు చేరువ కావడానికి, అందరి నమ్మకాన్ని చూరగొనడానికి రాజకీయాలకు గుడ్ బై [more]

Update: 2019-11-15 00:30 GMT

రాజ్యాంగ పదవులు ఉన్నవారు రాజకీయం చేయకూడదని నియమాలు ఎక్కడా లేవు. అయితే వారు అన్ని వర్గాలకు చేరువ కావడానికి, అందరి నమ్మకాన్ని చూరగొనడానికి రాజకీయాలకు గుడ్ బై చెబుతారు. అలా తమకు తాముగా విధించుకున్న నియమాలే తరువాత తరానికి ఆదర్శం అయ్యాయి. అయితే రాను రాను రాజకీయమే పరమావధి అయిపోయిన నేపధ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు సైతం మౌనంగా ఉండలేకపోతున్నారు. పైగా వారు నిన్నటి వరకూ రాజకీయమే శ్వాసగా బతికిన వారు కావడంతో మీడియా ముందుకు రాలేకుండా ఉండలేకపోతున్నారు.

ప్రేమ కురిపిస్తున్నారుగా….

ఇది నిజంగా ఇబ్బందికరమే. ఇవన్నీ తెలుసు కనుకనే ఉన్నతమైన రాజ్యాంగబధ్ధ పదవులకు రాజకీయ జోక్యం ప్రమేయం లేని వారిని ఎంపిక చేయమని మేధావులు గోడు పెడుతూంటారు. ఇక ఏపీ రాజకీయలం ఎవరు అవునన్నా కాదన్నా కులాల వారీగా చీలిపోయింది. దాంతో ఎంతటి పదవులలో ఉన్న వారికైనా కులాభిమానాలు ఉంటున్నాయి. అలాగే వారు అభిమానించే రాజకీయ పార్టీ నాయకుల మీద కూడా సానుభూతి వ్యక్తం అవుతూ ఉంటోంది, అది ఎంత దాచుకున్నా దాగడంలేదు. గతంలో దేశానికి రాష్ట్రపతులు, ఉప రాష్రపతులు, స్పీకర్లు, రాష్ట్రాలలో స్పీకర్లు గా ఉన్న వారు రాజకీయం అసలు మాట్లాడేవారు కాదు, కానీ ఇపుడు మాత్రం సాఫీగా హ్యాపీగా మాట్లాడేస్తున్నారు. మరి వారు మాట్లాడితే కౌంటర్లు కూడా అదే రేంజిలో పడుతాయి. రాజకీయాలు వారు మాట్లాడితే లేని తప్పు, వారికి కౌంటర్ ఇస్తే ఎలా తప్పు అవుతుందో కూడా ఆలోచించాలి. ఈ మధ్య చూస్తే ఏపీలో రెండు విషయాలు జరిగాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు, దానికి ప్రతిగా లోకేష్ నుంచి తమ్ముళ్లంతా తమ్మినేనిని అటాక్ చేస్తున్నారు బాబు సైతం దీనిని ప్రోత్సహిస్తున్నారు

సారీల కోసం డిమాండ్….

మరో వైపు స్పీకర్ మీద కామెంట్స్ చేస్తారా. ఆయన బీసీ కావడాన్ని టీడీపీ నేతలు తట్టుకోలకపోతున్నారని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దీని మీద మాట్లాడుతూ, స్పీకర్ తమ్మినేనికి చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు భాష విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కొన్ని కామెంట్స్ పట్ల ఏపీ సీం జగన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ మనవళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవడంలేదా నాయుడు గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు. దీని మీద మండిపడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజ్యాంగ పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు మీద జగన్ కామెంట్స్ చేయడమేంటని నిలదీస్తున్నారు. క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ రెండూ కూడా ఎలా వివాదం అయ్యాయో ఒక్కసారి అంతా ఆలోచించుకోవాలి. అటు స్పీకర్, ఇటు ఉపరాష్ట్రపతి పదవులు రెండూ అతి ముఖ్యమైనవి, పైగా రాజ్యాంగపదవులు. వాటిని అధిష్టించిన వారు కూడా దైనందిన రాజకీయాల్లొ జోక్యం చేసుకోకుండా ఉంటేనే ఆ పదవులకు అర్ధం, అందం.

Tags:    

Similar News