కాలం తీర్పుకు వదిలేశారా ?
కాలమే ఎపుడైనా తీర్పు చెప్పేది. అది అనంతం, శాశ్వతం, మధ్యలో వచ్చిన వారు వారి టైం బాగుంటే వెలుగుతారు, లేకపోతే మలుగుతారు. అందువల్ల ఏదైనా మంచి జరిగితే [more]
కాలమే ఎపుడైనా తీర్పు చెప్పేది. అది అనంతం, శాశ్వతం, మధ్యలో వచ్చిన వారు వారి టైం బాగుంటే వెలుగుతారు, లేకపోతే మలుగుతారు. అందువల్ల ఏదైనా మంచి జరిగితే [more]
కాలమే ఎపుడైనా తీర్పు చెప్పేది. అది అనంతం, శాశ్వతం, మధ్యలో వచ్చిన వారు వారి టైం బాగుంటే వెలుగుతారు, లేకపోతే మలుగుతారు. అందువల్ల ఏదైనా మంచి జరిగితే కాల మహిమ అనాలి. ఇది వేదాంతం అనుకున్నా రాద్ధాంతాలు చేయకూడదని నిర్ణయించుకున్నా కూడా కాలమే దిక్కు అవుతుంది. ఇపుడు అని రకాలుగా బండి లాక్కొచ్చిన వైసీపీ నేతలకు అలుపు వచ్చినట్లుంది, అంతే కాదు తాము చేయగలిగింది కూడా ఏమీ లేనట్లుగా ఉంది, అందుకే కాలం తీర్పు అంటున్నారు. ఈ విషయంలో తలపండిన పెద్దాయన, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు.
జగన్ కట్టుబడినా…
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల విషయంలో కట్టుబడినా కూడా తీర్పు మాత్రం కాలమే చెప్పాలి. ఇదీ తమ్మినేని సీతారాం తాజా కామెంట్స్. మూడు రాజధానులు తమకు ఎంతో ముఖ్యమైనవని, తమ ప్రభుత్వ చిత్తశుధ్ధిని ఎవరూ తప్పు పట్టలేరని కూడా ఆయన అంటున్నారు. అదే సమయంలో ఎపుడు అది అమలు అవుతుంది అంటే మాత్రం కాలం మీదనే నెడుతున్నారు. ఆ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నారు.
నిరాశతోనేనా..?
నిజానికి తమ్మినేని సీతారాం మూడు రాజధానుల విషయంలో చాలా ఎక్కువగానే స్పందించారు. మంత్రుల కంటే ఎక్కువగా ముందు వరసలో నిలబడి వాదించేవారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు విశాఖ రాజధాని అయితే తప్పేంటి అంటూ చర్చకు పెట్టేవారు. చంద్రబాబును గట్టిగానే తగులుకునేవారు. అటువంటి తమ్మినేని సీతారాం ఇపుడు ఒక్కసారిగా డల్ అయ్యారు. విశాఖ రాజధాని విషయంలో ఆయన మాటలు ఆశ నిరాశల మధ్యన దోబూచులాడుతున్నాయి. కాలం కలసి వస్తే అన్నట్లుగా తమ్మినేని సీతారాం చేస్తున్న వ్యాఖ్యలు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పినట్లుగానే ఉంది మరి.
ఏళ్ళూ పూళ్ళేనా….?
అవును, కోర్టుకు వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, కానీ ఈలోగా పుణ్యకాలం ఖర్చు అవుతుందని అంటారు. ఇపుడు మూడు రాజధానుల మీద వైసీపీ సర్కార్ చట్టం చేసినా కూడా ఉపయోగం లేకపోయింది. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవి ఎపుడు పూర్తి అవుతాయి అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు, మన రాత బాగుంటే, కాలం కలసివస్తే అన్న మాటలే వాడాలి. కరెక్ట్ గా తమ్మినేని సీతారాం అదే పదాన్ని వాడారు, ఆయన మాటలు వైసీపీ మొత్తం భావనను వ్యక్తీకరించినట్లుగా అనుకోకపోయినా కూడా మొత్తానికి ఆ పార్టీ కూడా ఇంతకంటే కొత్తగా ఆలోచిస్తుంది అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా దేవుడినో, కాలాన్నో దేన్నో దాన్ని నమ్ముకోవాలిగా?