బాబు బ్యాంక్ బ్యాలన్స్ పెరిగే చాన్స్ లేదా… ?

తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారకరామారావు స్థాపించారు. ఆయన అగ్ర వర్ణాలకు చెందిన వారు అయినా తన మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో సంపాదించుకున్న అద్భుతమైన [more]

Update: 2021-06-05 11:00 GMT

తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారకరామారావు స్థాపించారు. ఆయన అగ్ర వర్ణాలకు చెందిన వారు అయినా తన మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో సంపాదించుకున్న అద్భుతమైన ప్రేమానురాగాలను పెట్టుబడిగా పెట్టి పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ని ఉండేలా చూశారు. ఎన్టీయార్ టైమ్ లో బీసీలు టీడీపీ వైపు బాగా టర్న్ అయ్యారు. వారే ఆ పార్టీ విజయానికి పునాదులుగా మారిపోయారు. ఇక చంద్రబాబు కూడా ఆ ఓటు బ్యాంక్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంత టీడీపీ ఓడినా ఆ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరడంలేదు.

ఇదే గ్యారంటీయా..?

తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో 37 శాతం ఓటింగ్ వచ్చింది. నాడు అధికారంలో ఉండి టీడీపీ ఎన్నికలల్లో పాల్గొంది. దాంతో పాటు మళ్ళీ అధికారంలోకి రావాలన్న కసితో పొరాడింది. దాని ఫలితంగా ఆ ఓట్ల శాతం నమోదు అయింది. అయితే 2022కి వచ్చేనాటికి అది కాస్తా ముప్పయి శాతం అయిపోయింది. అంటే దారుణంగా ఏడు శాతం ఓట్లకు కోత పడిపోయింది. అది ఎలా జరిగింది అన్నది టీడీపీలో మధనం జరుగుతున్నా కూడా ఇది షాక్ ఇచ్చే పరిణామంగానే చూస్తున్నారు. తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే టీడీపీకి 30 శాతం ఓట్లే వచ్చాయి. అంటే బలమైన అధికార పార్టీని ఢీ కొట్టడానికి పదిహేను రోజుల పాటు పార్టీ మొత్తం ఒక చోట తిష్ట వేస్తే వచ్చిన ఓట్ల శాతమది.

కసికందలేదుగా..?

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ యాభై శాతం పై దాటే ఉంది. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను తీసుకుంటే ఆ విషయం బోధపడుతోంది. సరే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇంత ఓట్ల శాతం వచ్చింది అని ఎవరైనా అనవచ్చు. కానీ 2014 ఎన్నికల్లో కూడా వైసీపీకి 43 శాతం ఓట్లు వచ్చాయి. ఇక బస్తీమే సవాల్ అని 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ మీద కాలు దువ్వి నాడు కూడా అధికార టీడీపీ అన్ని రకాలుగా వనరులు ఉపయోగించుకుని గెలిచింది. మరి అంత జరిగినా ఆ ఎన్నికల్లోనూ వైసీపీకి 43 శాతం ఓట్లు తగ్గలేదు. ఇక నాడు జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది కానీ వైసీపీకి ఓట్లు 40 శాతానికి తక్కువగా రాలేదు.

ఎన్ని ముడులు వేయాలో …?

ఇపుడు ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని తీసుకుంటే జనసేనకు గట్టిగా 5 శాతం ఓట్లు ఉన్నాయి. బీజేపీకి ఒక్క శాతం ఉంది. వామపక్షాలు కాంగ్రెస్లను కలుపుకున్నా కూడా మరో శాతం కలుస్తుంది. అంటే గ్రాండ్ అలయెన్స్ అంటూ టీడీపీ ముందుకు వచ్చినా 37 శాతం మించి ఓట్లు వచ్చే అవకాశం లేదనే పరిస్థితి ఉంది. ఇక మరో మూడేళ్ళకు వైసీపీకి ఎంత వ్యతిరేకత వచ్చినా 45 శాతానికి తక్కువ కాకుండా ఓట్లు వచ్చినా తటస్థ ఓటర్లు సైతం విపక్ష కూటమి మద్దతు ఇచ్చినా టీడీపీ కూటమి నలభై శాతానికి మించి ఓట్లు సాధించలేదు అన్నదే ప్రస్తుత విశ్లేషణ. రెండు దఫాలుగా ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ సర్కార్ చీలిపోయి, విభజన ఏపీలో పోటీ పడితే 2014 ఎన్నికల్లో టీడీపీకి పొత్తులతో వచ్చిన ఓట్ల శాతం 43గా నమోదు అయింది. అంటే జగన్ మీద అంత వ్యతిరేకత రావాలంటే మరి రెండు ఎన్నికల వరకూ టీడీపీ వెయిటింగ్ లిస్ట్ ఉండాల్సిందేనా అన్న చర్చ అయితే ఉందిపుడు.

Tags:    

Similar News