ఏపీలో మళ్లీ మరో ఉప ఎన్నిక తప్పదా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయంలో మార్పు ఏమీ ఉండదని ఆయన తన సన్నిహతులకు తెగేసి చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కూడా ఇక కలిసేది లేదని చెబుతుండటంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అనివార్యం అని అంటున్నారు.
గోరంట్ల రాజీనామా చేస్తే….
దీంతో ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లోనూ ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరు సార్లు రాజమండ్రి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకే సిద్ధమయ్యారు.
రెండింటిని ఒకేసారి….
ఈ నెల 25వ తేదీన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా పెండింగ్ లో ఉంది. మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మూడు ప్రాంతాల్లో సత్తా…..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తే ఒకేసారి రెండింటిని ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జగన్ కూడా తన గ్రాఫ్ ను మరోసారి పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నిక జరిగేందుకు సిద్ధంగా ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మూడు నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి మూడు ప్రాంతాల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో మరో మూడు ఉప ఎన్నికలు తప్పవన్న అంచనాలు పార్టీ నేతల నుంచి విన్పిస్తున్నాయి