Tdp : టీడీపీకి త్రీ “జీ” ఫీవర్

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు త్రీ “జీ” ల ఫీవర్ పట్టుకుంది. వారిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తే చాలు సగం స్థానాలను గెలిచినట్లే. తెలుగుదేశం పార్టీ నేతలందరూ త్రీ [more]

Update: 2021-11-01 06:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు త్రీ “జీ” ల ఫీవర్ పట్టుకుంది. వారిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తే చాలు సగం స్థానాలను గెలిచినట్లే. తెలుగుదేశం పార్టీ నేతలందరూ త్రీ “జీ” పైనే చర్చిస్తుండటం విశేషం. తెలుగుదేశం పార్టీ కోస్తాంధ్రలో బలమైన కమ్మ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తుంది. అలాంటిది గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గం ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సాధించలేకూపోయింది.

గుడివాడ నుంచి…

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజికవర్గం నేతలతోనే పార్టీని టార్గెట్ చేయిస్తుంది. గుడివాడ, గుణదల, గన్నవరం నేతలు టీడీపీకి ఇబ్బందికరంగా మారారు. గుడివాడ నుంచి అంటే కొడాలి నాని ఇప్పటి నుంచి కాదు తొలి నుంచి వైసీపీ వైపే ఉన్నారు. ఆయన వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసేవారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూనే నారా వారి కుటుంబాన్ని నడిరోడ్డుపై బట్టలూడదీయాలని పిలుపునిచ్చేవారు. కొడాలి నాని టీడీపీకి గత కొన్నేళ్లుగా కొరకరాని కొయ్యగా మారారు.

గన్నవరం ఎమ్మెల్యే….

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. తర్వాత వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. పార్టీని వీడుతూ చంద్రబాబు, లోకేష్ ను వీధిన పడేశారు. లోకేష్ వల్లనే తాను పార్టీని వీడినట్లు వల్లభనేని వంశీ చెప్పారు. దమ్ముంటే తనపై లోకేష్ పోటీ చేయాలని, తాను రాజీనామాకు సిద్ధమని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ నేతలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

గుణదల నేతగా….

దీంతో పాటు విజయవాడ గుణదలకు చెందిన దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ 2019 ఎన్నికల వరకూ టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో చేరిపోయారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపింది దేవినేని అవినాష్ అనుచరులేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో గుణదల, గన్నవరం, గుడివాడ వైసీపీ నేతలు టీడీపీకి తలనొప్పిగా మారింది. చంద్రబాబు కూడా దీక్ష విరమణ సందర్భంగా ఈ ముగ్గురికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News