సొంత మీడియా కన్నా సోషల్ మీడియా బెటర్
తెలుగుదేశం పార్టీ బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం లో ఆ పార్టీ మీడియా ముందు ఉంటుంది. మొన్నటి [more]
తెలుగుదేశం పార్టీ బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం లో ఆ పార్టీ మీడియా ముందు ఉంటుంది. మొన్నటి [more]
తెలుగుదేశం పార్టీ బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం లో ఆ పార్టీ మీడియా ముందు ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి చెవిలో దూది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారం లోకి వస్తుందని పసుపు మీడియా చేసిన హడావిడి క్షేత్ర స్థాయిలో వున్న ప్రజావ్యతిరేకత ను చంద్రబాబు గుర్తించలేని స్థితిని కల్పించింది. పార్టీ ఘోర ఓటమిలో ఇవన్నీ కూడా ఒకటిగా అధినేత గుర్తించారు. అనుకూల మీడియాలో నిజమైనా అబద్ధమైనా అసత్యం గానే ప్రజలు భావిస్తుండటం గమనించారు బాబు. వైఎస్ హయం నుంచి జగన్ వరకు ఎల్లో మీడియా అంటూ ప్రజల్లోకి నేరుగా తమ అనుకూల మీడియా ఏమిటన్నది తెలిసిపోయేలా చేయడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ కి దిక్కు అయ్యింది.
వ్యూహం మార్చారు ...
దాంతో వైసిపి పై విమర్శలు, ఆరోపణలు, అన్ని కూడ సోషల్ మీడియా ద్వారానే వ్యాప్తి చేయాలన్న వ్యూహాన్నే పసుపుదళం అనుసరిస్తుంది. ప్రజావేదిక కూల్చివేత, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని హేళన చేస్తూ తెలంగాణ కు అన్ని ధారాదత్తం చేస్తున్నారంటూ ఇలా ప్రతి అంశం సోషల్ మీడియా వేదికలపై సెటైర్లుగా వదులుతున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ఇక కామెడీ పంచ్ లు సెలబ్రిటీల బొమ్మలతో పెట్టె పోస్టింగ్స్ కి లెక్కేలేదు. ఈ తరహా వ్యూహాన్నే వైసిపి ఎన్నికల ముందు అనుసరించింది. సొంత మీడియా పై ఆధారపడకుండా సోషల్ మీడియా ద్వారా వైసిపి చేసిన ప్రచారం ఆ పార్టీకి చాలా ప్రయోజనాలు దక్కించిందన్నది ఎన్నికల ఫలితాలు చెప్పక చెప్పాయి. ఇప్పుడు బాబు సైన్యం అదే రూట్ లో నడుస్తుంది. చూడాలి ఇప్పుడు అధికారపార్టీ ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా యుద్ధాన్ని