జగన్ ఎలా తట్టుకుంటారో…??
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఇప్పటికే లోటు [more]
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఇప్పటికే లోటు [more]
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఇప్పటికే లోటు బడ్జెట్ సహా మితిమీరిన అప్పులతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని జగన్ భావించారు. దీనికి సంబంధించి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందుగానే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విన్నవించారు. ఈ క్రమంలోనే వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి నిధులను తిరిగి ఇవ్వాలని, ఈ ఏడాది కూడా ఆయా జిల్లాలకు నిధులను కొనసాగించిలని ఆయన కోరారు. ఇక, కేంద్ర ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం పూర్తికి నిధులు కేటాయించాలని కోరారు.
ఆర్థిక పరిస్థితిని చూడకుండా…..
రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని సూచించారు. అదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రుణ పరిమితి విషయంలోనూ సడలింపు ఇవ్వాలని కోరారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేంద్రం బడ్జెట్ రూపొందించే క్రమంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోనూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ క్రమంలో ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర నాథ్.. కూడా ఏపీ సమస్యలను నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఆదుకోవాలని కోరుతూ.. సమస్యల చిట్టాను విప్పి చూపించారు. మరో పక్క పార్లమెంటు సమావేశాల్లో వైసీనీ పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. “ మీరు ఉదారంగా ఆదుకోకపోతే.. మరో నాలుగు మాసాల్లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం ఖాయం“ అని చెప్పుకొచ్చారు. కాని వైఎస్ జగన్ ఆశలు గల్లంతయ్యాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా….
మరి రాష్ట్రం నుంచి ఇన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కేంద్రం తన బడ్జెట్‌లో ఏపీకి పెద్ద పీట వేయడం ఖాయమని ఎవరైనా అనుకుంటారు. ముఖ్యంగా తొలిసారి సీఎం అయిన ఏపీ రెండో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కేంద్ర బడ్జెట్‌పై మరిన్ని ఆశలు పెట్టుకోవడంతో ఆశ్యర్యం లేదు. అయితే, తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి మొండి చేయి చూపించింది. కేవలం రెండు విషయాల్లో మాత్రమే స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని పక్కన పెట్టింది. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీకి రూ.13 కోట్లు గిరిజన విశ్వవిద్యాలయానికి రూ. 8 కోట్లు మాత్రమే విదిలించింది. మిగిలిన ఐఐటీ, ఐఐఎం, నీట్, ట్రిపుల్ ఐటీలకు ఒక్క పైసా కూడా విదిలించలేదు. మరీ ముఖ్యంగా వై.ఎస్.జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అమలు చేయాల్సిన కేంద్ర ప్రతిపాదనలపై పెదవి విప్పలేదు.
కేంద్ర నిధుల్లో….
అంగన్ వాడీల్లో మద్యాహ్న భోజన నాణ్యత పెంచుతామని వై.ఎస్. జగన్ హామీ ఇచ్చారు. దీనికిగానూ కేంద్రం నిధులు పెంచాలని సూచించారు. అయితే, ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇక, అంగన్‌వాడీల జీతాల పెంపుతో సహా పారిశ్రామికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సహా రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు నానా తిప్పలు పడాల్సి రావడం ఖయమని అంటున్నారు. ఆర్థిక నిపుణులు మరి వై.ఎస్. జగన్ ఎలా తట్టుకుని ముందుకు వెళ్తారో ?చూడాలి.