పోటీ గ్యారంటీ అట…అయితే?

తెలుగుదేశం పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే అంతా కోల్పోయినట్లుగా ఉన్న టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపాలని సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం [more]

Update: 2020-01-11 08:00 GMT

తెలుగుదేశం పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే అంతా కోల్పోయినట్లుగా ఉన్న టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపాలని సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే తమకు బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేయాలని, మిగిలిన ప్రాంతాల్లో గెలిచే అవకాశముండి, టీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీలకు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది.

రెండు స్థానాల్లోనే….

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అదీ ఏపీని ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాల్లో మాత్రమే పసుపు జెండా ఎగిరింది. ఆ తర్వాత జరిగిన ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా పూర్తి నైరాశ్యంలోకి వెళ్లింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సయితం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.

రెండు నెలలుగా….

అయితే ఏపీలో పార్టీ ఓటమి పాలయ్యాక చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీపై కూడా దృష్టి పెట్టారు. ప్రతి శని, ఆదివారాల్లో నేతలు, కార్కకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుంటే నేతలతో పాటు క్యాడర్ కూడా ఇక మిగలదని గుర్తించిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నేతలను తయారు చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో…..

అందుకోసమే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎవరితో పొత్తులు లేకుండానే ఒంటరిగా పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇటీవల కాంగ్రెస్ నేతలు కుంతియా, భట్టి విక్రమార్కలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపారు. తాము బలం ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా పోటీ చేస్తామని, మిగిలిన ప్రాంతాల్లో టీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీకి అయినా మద్దతును పరోక్షంగా ఇస్తామని చెప్పడంతో టీడీపీ తెలంగాణలో పట్టు బిగించేందుకే రెడీ అయిందని చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News