2019 నాటి గాయాలు .. టీడీపీకి మరింత ఎక్కువవుతున్నాయా..?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఏపీ అధికార పక్షం వైసీపీపై పైచేయి సాధించేందుకు ఉన్న ఏకైక వేదిక శాసన మండలి. 2019 ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఏపీ అధికార పక్షం వైసీపీపై పైచేయి సాధించేందుకు ఉన్న ఏకైక వేదిక శాసన మండలి. 2019 ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఏపీ అధికార పక్షం వైసీపీపై పైచేయి సాధించేందుకు ఉన్న ఏకైక వేదిక శాసన మండలి. 2019 ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైన టీడీపీ.. వీరిలోనూ నలుగురిని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో అసెంబ్లీలో వైసీపీదే పైచేయి అయింది. దీంతో ఏం మాట్లాడినా.. అసెంబ్లీలో టీడీపీకి వాయిస్ ఉండడం లేదు. పైగా స్పీకర్ నుంచి ఎదురవుతున్న సస్పెన్షన్లు, అరెస్టులు కామన్‌గా మారిపోయాయి. దీంతో టీడీపీ అసెంబ్లీలో జీరో అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మండలిలో మాత్రం…?
అయితే.. శాసన మండలిలో మాత్రం టీడీపీ బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో మండలిలో గణనీయంగా టీడీపీకి ప్రాధాన్యం లభించింది. దీంతో వైసీపీ సర్కారుకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మూడు రాజధానులు, ఏపీ సీఆర్ డీఏ చట్టం రద్దు వంటి కీలక నిర్ణయాల విషయంలో మండలిలో టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేక త ఎదురైంది. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన సీఎం జగన్.. మండలి రద్దుకు ప్రతిపాదించారు.
పై చేయి సాధించేందుకు …?
ఇలా.. అటు అసెంబ్లీలో కాకపోయినా.. మండలిలో అయినా టీడీపీ.. అధికార వైసీపీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది. అయితే.. ఇప్పుడు రాను రాను మండలిలో టీడీపీ నేతలు తగ్గిపోతున్నారు. ఈ ఒక్క నెలలోనే శాసన సభ్యుల కోటాలో మూడు సీట్లు ఖాళీ అవగా.. గవర్నర్ కోటాలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీ అయిన సీట్లన్నీ కూడా టీడీపీవే కావడం గమనార్హం. ఇక, ఇటీవలే మండలి చైర్మన్ కూడా రిటైరయ్యారు. సో.. దీంతో టీడీపీకి పెద్దల సభలో వాయిస్ తగ్గిపోతోంది.
మరో మూడు మాసాల్లో…?
మరో మూడు మాసాల్లో.. వైసీపీ బలం మరింత పెరగనుంది. దీంతో టీడీపీ వాయిస్ పూర్తిగా సన్నగిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వాయిస్ బాగానే వినిపిస్తున్న నారా లోకేష్‌కు నిన్నటి వరకు చేదోడుగా ఉన్న నేతలు కూడా రిటైర్ అవుతుండడంతో మండలిలో లోకేష్ వాయిస్ కూడా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సో.. మొత్తంగా 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బ తాలూకు గాయాలు.. టీడీపీని మరింత వేధించనున్నాయన్న మాట.. అంటున్నారు పరిశీలకులు.